Malayalam OTT: 30 కోట్ల బడ్జెట్ - 100 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ!
Malayalam OTT: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో మూవీ మలయాళంలో వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. ఏ రేటింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న మలయాళం మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది.
Malayalam OTT: ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది మార్కో మూవీ. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. మలయాళ సినీ హిస్టరీలో ఏ రేటింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా మార్కో రికార్డ్ క్రియేట్ చేసింది.మార్కో మూవీ తెలుగు వెర్షన్ జనవరి 1న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తమిళంలో జనవరి 3న ఈ మూవీ విడుదల అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
కాగా మార్కో మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. థియేటర్లలో రిలీజైన నెల నుంచి నలభై ఐదు రోజుల తర్వాతే ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేసేలా నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. జనవరి నెలాఖరున లేదా...డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారంజరుగుతోంది.
రిలీజ్‌కు ముందే లీక్...
అయితే మార్కో మూవీ ఓటీటీ రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ సినిమా హిందీ వెర్షన్ పైరసీ సైట్స్‌లో దర్శనమిచ్చింది. ఈ లీక్‌పై సినిమా యూనిట్ రియాక్ట్ అయ్యింది. సినిమాను లీక్ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు.
ఉన్ని ముకుందన్ హీరో...
యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన మార్కో మూవీలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. సిద్ధిఖీ, జగదీష్, కబీర్ సింగ్ దుహాన్ కీలక పాత్రల్లో నటించారు. స్టైలిష్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన మార్కోకు హనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.
రివేంజ్ డ్రామా...
తన సోదరుడి మరణంపై ఓ యువకుడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? ఎలాంటి క్లూ లేని ఈ కేసులో అసలైన హంతకుడిని ఎలా పట్టుకున్నాడనే పాయింట్‌తో మార్కో మూవీని దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించాడు. సినిమాలో రక్తపాతం, హింస ఎక్కువైందనే విమర్శలు వచ్చాయి.
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్...
మార్కో ఉన్ని ముకుందన్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు ఉన్ని ముకుందన్. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించాడు.ఆ తర్వాత అనుష్క భాగమతి, సమంత యశోదతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. హీరోగానే కాకుండా మలయాళంలో ప్రొడ్యూసర్‌గా, సింగర్‌గా టాలెంట్‌ను నిరూపించుకున్నాడు ఉన్ని ముకుందన్.