OTT Action Thriller: మోస్ట్ వైలెంట్ బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది? నిర్మాత చెప్పింది ఇదే
OTT Action Thriller: మలయాళ మూవీ మార్కో సెన్సేషనల్ హిట్‍గా నిలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో రూమర్లు వస్తున్నాయి. దీనిపై నిర్మాత స్పందించారు.
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో చిత్రం సెన్సేషన్‍గా మారింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. మలయాళం, హిందీలో డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజైంది. కేరళలో భారీ వసూళ్లు సాధిస్తోంది. జనవరి 1న తెలుగులోనూ విడుదల కాగా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీగా మార్కో పాపులర్ అయింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. దీంతో మేకర్స్ స్పందించారు.
ఓటీటీ రిలీజ్‍పై నిర్మాత రియాక్షన్
మార్కో చిత్రానికి హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షరీఫ్ మహమ్మద్ నిర్మించారు. మార్కో చిత్రం ఓటీటీలోకి రానుందంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఖరారైందంటూ సోషల్ మీడియాలో సమాచారం చక్కర్లు కొడుతోంది. దీంతో నిర్మాత షరీఫ్ మహమ్మద్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ లెటర్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఓటీటీ డీల్ చేసుకోలేదని వెల్లడించారు.
ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍తోనూ ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ ఒప్పందం చేసుకోలేదని నిర్మాత షరీఫ్ స్పష్టం చేశారు. “మేం ఓ విషయంపై స్పషత ఇవ్వాలనుకున్నాం. ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍తో అగ్రిమెంట్ చేసుకోలేదు, ఓ డీల్‍ను కన్ఫర్మ్ చేయలేదు” అని వెల్లడించారు. ఈ లెటర్‌ను ఉన్ని ముకుందన్ కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు థియేటర్లలోనే ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయాలంటూ లెటర్‌లో మేకర్స్ ప్రేక్షకులను కోరారు. ఓటీటీ గురించి ఏదైనా అప్‍డేట్ ఉంటే అధికారికంగా చెబుతామని పేర్కొన్నారు.
మార్కో కలెక్షన్లు
మార్కో చిత్రం సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ సినిమా కేరళ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. ఆరంభం మోస్తురగా ఉన్నా పాజిటివ్ మోత్ టాక్‍తో దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది. తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. వసూళ్లను బాగానే రాబడుతోంది. ఈ మూవీకి ఇంకా థియేట్రికల్ రన్ జోరుగా సాగుతోంది.
మార్కో చిత్రంలో ఉన్ని ముకుందన్‍తో పాటు సిద్దిఖీ, కబీర్ దుహాన్ సింగ్, జగదీశ్, అభిమన్యు తిలకన్, యుక్తి తరేజా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే, హింసాత్మక, క్రూరమైన సీన్లు ఎక్కువగా ఉన్నాయని, సెన్సిటివ్‍గా ఉండే వారు చూడొద్దంటూ చాలా మంది సోషల్ మీడియాలోనూ సూచిస్తున్నారు. యానిమల్, కిల్ చిత్రాలను మించి వైలెంట్ సీన్లు ఈ మూవీలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం