OTT Action Thriller: మలయాళ యాక్షన్ సెన్సేషనల్ హిట్ చిత్రానికి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారు!-unni mukundan action thriller movie marco digital streaming rights bagged by sony liv ott reports ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: మలయాళ యాక్షన్ సెన్సేషనల్ హిట్ చిత్రానికి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారు!

OTT Action Thriller: మలయాళ యాక్షన్ సెన్సేషనల్ హిట్ చిత్రానికి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారు!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 25, 2025 03:45 PM IST

OTT Action Thriller: మార్కో సినిమా సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ అయింది. భారీ కలెక్షన్లను దక్కించుకుంటోంది. మలయాళంలో దుమ్మురేపిన ఈ చిత్రం తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ ఖరారు చేసుకుందని తెలుస్తోంది.

OTT Action Thriller: మలయాళ యాక్షన్ సెన్సేషనల్ హిట్ చిత్రానికి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారు!
OTT Action Thriller: మలయాళ యాక్షన్ సెన్సేషనల్ హిట్ చిత్రానికి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారు!

‘మార్కో’ సినిమా సంచలన విజయం దక్కించుకుంది. తక్కువ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే మోస్ట్ వైలెంట్ మూవీగా పేరు తెచ్చుకుంది. డిసెంబర్ 20న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం కేరళలో సెన్సేషనల్ కలెక్షన్లు సాధించింది. తెలుగులోనూ జనవరి 1న థియేటర్లలో రిలీజైంది. మంచి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ మార్కో సినిమా ఓటీటీ డీల్ జరిగిందని తెలుస్తోంది.

ఈ ఓటీటీకే హక్కులు

మార్కో మూవీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఫుల్ క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి ఆ ఓటీటీ భారీ ధర ఇచ్చిందని తెలుస్తోంది. అయితే, సోనీ లివ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందో తేదీపై క్లారిటీ రాలేదు.

కన్నడలోనూ మార్కో మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో సోనీ లివ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టేందుకు మరింత ఆలస్యం కావొచ్చు. ఫిబ్రవరిలో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

మార్కో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందని తొలుత రూమర్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ సమాచారం చక్కర్లు కొట్టింది. అయితే, ఈ విషయంపై మేకర్లు కొన్నాళ్లకు స్పందించారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీతో డీల్ జరగలేదని, ఇప్పట్లో స్ట్రీమింగ్‍కు రాదని తెలిపారు. థియేటర్లలో ప్రస్తుతం సినిమాను ఎంజాయ్ చేయాలంటూ లెటర్ రిలీజ్ చేశారు. అయితే, తాజాగా సోనీ లివ్‍కు స్ట్రీమింగ్ హక్కులను విక్రయించారని తెలుస్తోంది. ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దుమ్మురేపేలా కలెక్షన్లు

మార్కో సినిమా ఇప్పటికే రూ.115కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఇటీవలే వెల్లడించింది. ఈ చిత్రం దాదాపు రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఆ స్థాయిలో వసూళ్లతో సెన్సేషనల్ హిట్ సాధించింది. సెన్సార్ ఏ రేటింగ్‍తో మలయాళంలో రూ.100కోట్లు మార్క్ దాటిన తొలి మూవీగానూ మార్కో నిలిచింది.

మార్కో చిత్రానికి హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు. వైలెంట్ యాక్షన్‍తో ఈ రివేంజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హింస, క్రూరమైన సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇవే ఈ మూవీకి క్రేజ్ తెచ్చిపెట్టాయి. హనీఫ్ టేకింగ్‍కు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం నేషనల్ రేంజ్‍లో పాపులర్ అయింది. అయితే, హింస మరీ విపరీతంగా ఉందనే కామెంట్లు కూడా వచ్చాయి. మొత్తానికి మార్కో మాత్రం అంచనాలకు మించి బ్లాక్‍బస్టర్ సాధించింది.

మార్కో మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‍తో పాటు సిద్ధిఖీ, అభిమన్యు తిలకన్, జగదీశ్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పౌల్, యుక్తి తరేజా, ఇషాన్ షౌరత్త్ కీలకపాత్రలు చేశారు. ఈ మూవీకి రవిబస్రూర్ సంగీతం అందించగా.. చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది.

Whats_app_banner

సంబంధిత కథనం