Sreeleela- Two kids: తెలుగు స్టార్ హీరోయిన్.. వరుస సినిమాలు.. పెళ్లి కాలేదు.. ఇద్దరు పిల్లలు.. 23 ఏళ్ల ఈ భామ ఎవరంటే?
Sreeleela- Two kids: తెలుగులో ఈ భామ వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. హిందీలోనూ ఓ సినిమా చేస్తూ డెబ్యూకి రెడీ అవుతోంది. మరోవైపు స్పెషల్ సాంగ్ తోనూ కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. 23 ఏళ్లకే ఇద్దరు పిల్లలకు తల్లయిన ఆ హీరోయిన్ ఎవరో చూసేయండి.

శ్రీలీల.. గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ఓ వైపు సీనియర్ స్టార్ హీరోలతో.. మరోవైపు కుర్రాళ్లతో ఆడిపాడుతోంది ఈ భామ. 23 ఏళ్లకే వరుస సినిమాలతో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. అలాంటి స్టార్ హీరోయిన్ కు ఇద్దరు పిల్లలున్న సంగతి మీకు తెలుసా? అదేంటీ శ్రీలీలకు ఇంకా పెళ్లే కాలేదు.. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారంటారా?
గోల్డెన్ హార్ట్
గ్లామర్, హాట్ నెస్, యాక్టింగ్ తో అదరగొట్టే శ్రీలీలకు గోల్డెన్ హార్ట్ కూడా ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. శ్రీలీల మంచి మనసుతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. అది కూడా దివ్యాంగులు కావడం శ్రీలీల గోల్డెన్ హార్ట్ ను చాటుతోంది.
పిల్లల కేరింగ్
2022లో శ్రీలీల ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఓ అనాథశ్రమానికి వెళ్లిన ఆమె.. అక్కడ ఉన్న దివ్యాంగులైన గురు, శోభితను అడాప్ట్ చేసుకుంది. కన్నడ సినిమా ‘బై టూ లవ్’ కంటే ముందే శ్రీలీల ఈ ఇద్దరినీ దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. గురు, శోభిత ను చాలా కేరింగ్ తో శ్రీలీల చూసుకుంటోంది.
సినిమాల్లో క్యూట్ నెస్ తో కుర్రకారు గుండెలను కొల్లగొడుతున్న శ్రీలీల.. ఇద్దరి పిల్లలను దత్తత తీసుకుని స్ఫూర్తిగానూ నిలుస్తోంది. ఏ సంబంధం లేని గురు, శోభితను చూడగానే ఆమెకు ఓ కనక్షన్ ఏర్పడింది. దీంతో వీళ్ల కు తల్లిగా మారింది.
కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ లో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ అవార్డు ఫంక్షన్లో కార్తీక్ వాళ్ల అమ్మ.. తమ కోడలు డాక్టరైతే బెటర్ అని అన్నారు. శ్రీలీల 2021 లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. అనురాగ్ బసు డైరెక్షన్ లో ఇంకా టైటిల్ డిసైడ్ చేయని హిందీ మూవీలో కార్తీక్, శ్రీలీల జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లోనే వీళ్ల మధ్య లవ్ పుట్టిందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
కిసిక్ పాప బిజీ
పుష్ప-2 సినిమాలో కిస్ కిస్ కిసిక్ అంటూ స్పెషల్ సాంగ్ లో కుర్రాళ్ల మతులు పోగొట్టిన శ్రీలీల చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో నితిన్ తో రాబిన్ హుడ్ చేస్తోంది. తెలుగులో మాస్ జాతర, తమిళ్ లో పరాశక్తి, హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమాతో తీరిక లేకుండా ఉందీ ముద్దుగుమ్మ. 2019లో కన్నడ సినిమా ‘కిస్’తో శ్రీలీల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.