Kalki 2898 AD Song: కల్కి సినిమాలో ఆ రొమాంటిక్ సాంగ్ విజువల్ ట్రీట్‍గా ఉంటుందట!
Kalki 2898 AD Song: కల్కి 2898 ఏడీ సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో ఓ పాట గురించి బజ్ విపరీతంగా నడుస్తుంది. ఇది అద్భుతమైన విజువల్స్‌తో ఉంటుందని తెలుస్తోంది.
Kalki 2898 AD Movie: సినీ జనాల్లో ఇప్పుడు అంతా కల్కి 2898 ఏడీ ఫీవర్ ఉంది. ఈ మూవీపై క్యూరియాసిటీ విపరీతంగా పెరిగిపోతోంది. పోస్టర్లు, గింప్స్ అన్నీ అద్భుతంగా ఉండటంతో అంచనాలు కూడా భారీస్థాయికి చేరాయి. జూన్ 27న ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఆరోజు ఎప్పుడెప్పుడూ వస్తుందా అని అందరూ నిరీక్షిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. కాగా, ఈ చిత్రంలో ఓ పాట గురించి తాజాగా బజ్ నడుస్తోంది.

విజువల్ ట్రీట్‍గా ఈ సాంగ్
కల్కి 2898 ఏడీ సినిమాలో అండర్ వాటర్ సాంగ్ ఉండనుందని సమాచారం బయటికి వచ్చింది. ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీతో ఈ పాట ఉంటుంది. ఈ పాటలో సముద్రంలోపల విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ రొమాంటిక్ సాంగ్.. సిల్వర్ స్క్రీన్‍పై ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‍లా ఉంటుందనే టాక్ సినీ సర్కిల్‍లో తాజాగా చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్, దిశా పటానీ చిందేసిన ఈ పాటను ఇటలీలో చిత్రీకరించింది మూవీ టీమ్. అప్పట్లో ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ పాటనే అండర్ వాటర్ సాంగ్‍గా ఉండనుంది. ఈ పాట ఎలా ఉంటుందోనని కూడా సినీ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.
కల్కి ట్రైలర్ డేట్ ఖరారు
కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. జూన్ 10వ తేదీన ట్రైలర్ విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ నేడు (మే 5) అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ ఉన్న కొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది.
కల్కి 2898 ఏడీ సినిమా మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తోంది. మహాభారతం నుంచి భవిష్యత్తు కాలమైన 2898 వరకు ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ గతంలోనే చెప్పారు. ఈ సినిమాలోని ప్రధాన క్యారెక్టర్లను కూడా పురాణాల్లోని పాత్రల స్ఫూర్తిగానే తెరక్కించారు డైరెక్టర్. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జి అనే స్పెషల్ కారు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. భైరవ (ప్రభాస్)తో బుజ్జి అనే గ్లింప్స్ అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంది. అలాగే, బుజ్జిభైరవ అనే యానిమేటెడ్ సిరీస్‍ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మూవీ టీమ్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. ఈ సిరీస్‍కు అద్భుతమైన స్పందన వస్తోంది.
కల్కి 2898 ఏడీ చిత్రంలో భారీతారాగణం ఉంది. ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, హస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీలో కొందరు స్టార్ నటీనటుల క్యామియో రోల్స్ కూడా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. జూన్ 27న గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను భారీగా నిర్వహించేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.
టాపిక్