UI TV Premiere Date: కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన మూవీ యూఐ (UI). గతేడాది డిసెంబర్ 20న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకూ ఓటీటీలోకి రాలేదు. అయితే అప్పుడే టీవీ ప్రీమియర్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ జీ కన్నడ ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. అయితే ఓటీటీ రిలీజ్ పై మాత్రం ఎలాంటి ప్రకటనా లేదు.
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించి, డైరెక్ట్ చేసిన మూవీ యూఐ. ఈ సినిమా ఉగాది సందర్భంగా జీ కన్నడ ఛానెల్లో ప్రీమియర్ కాబోతోంది. ఈ ఆదివారం (మార్చి 30) సాయంత్రం 4.30 గంటలకు మూవీ టెలికాస్ట్ కానున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. దీంతో అప్పటి నుంచే ఓటీటీలోకి కూడా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో జీ నెట్‌వర్క్ తాను హక్కులు పొందిన సినిమాలను ఒకేసారి ఇటు టీవీ, అటు ఓటీటీలోకి తీసుకొస్తోంది. కిచ్చా సుదీప్ మ్యాక్స్, తెలుగులో వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఇలాగే రెండింట్లోనూ ఒకేసారి వచ్చాయి. దీంతో ఇప్పుడు యూఐ కూడా అదే రూట్లో వెళ్తుందని భావిస్తున్నారు. జీ కన్నడలో వచ్చే సమయానికే జీ5లోనూ స్ట్రీమింగ్ కు వస్తుందేమో చూడాలి.
నిజానికి ఫిబ్రవరిలోనే ఈ యూఐ మూవీ టీవీ ప్రీమియర్ త్వరలోనే అంటూ జీ కన్నడ ఛానెల్ చెప్పింది. అయితే ఆ తర్వాత చాలా రోజుల పాటు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈలోపు ఫిబ్రవరి 15న మ్యాక్స్ మూవీని అటు జీ కన్నడ, ఇటు జీ5లలోకి ఒకేసారి తీసుకొచ్చింది.
ఉపేంద్ర డైరెక్ట్ చేసి నటించిన మూవీ యూఐ. ఈ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యూఐ మూవీ కేవలం రూ.45 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ఉపేంద్ర సినిమాకు ఇదే అత్యధిక వసూళ్లయినా.. యూఐ బడ్జెట్ లో సగం కూడా కాకపోవడంతో మేకర్స్ నష్టపోయారు. డిసెంబర్ 20న రిలీజైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించినా.. తర్వాత వచ్చిన నెగటివ్ రివ్యూలతో వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. ఐదు రోజుల తర్వాత మ్యాక్స్ కూడా రిలీజ్ కావడంతో యూఐ క్రమంగా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
సంబంధిత కథనం