UI OTT Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి ఉపేంద్ర డిజాస్టర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ!-ui ott release date upendra sci fi action movie tv premier may happen before ott streaming reveals latest ad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ui Ott Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి ఉపేంద్ర డిజాస్టర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ!

UI OTT Release Date: ఓటీటీ కంటే ముందే టీవీలోకి ఉపేంద్ర డిజాస్టర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ!

Hari Prasad S HT Telugu
Jan 29, 2025 04:43 PM IST

UI OTT Release Date: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర డైరెక్ట్ చేసి నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ యూఐ (UI) ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేలా కనిపిస్తోంది. తాజాగా జీ కన్నడ ఛానెల్ రిలీజ్ చేసిన ప్రోమోతో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటీటీ కంటే ముందే టీవీలోకి ఉపేంద్ర డిజాస్టర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ!
ఓటీటీ కంటే ముందే టీవీలోకి ఉపేంద్ర డిజాస్టర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ!

UI OTT Release Date: ఉపేంద్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ యూఐ. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరో షాక్ తగిలింది. ఈ మూవీ ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

yearly horoscope entry point

యూఐ టీవీ ప్రీమియర్ వచ్చేస్తోంది

ఉపేంద్ర నటించిన యూఐ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులు రెండూ సన్ నెట్‌వర్క్ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ తర్వాత మూవీ టీమ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. యూఐ ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఇచ్చే అప్డేట్సే ఫాలో కావాలని స్పష్టం చేసింది.

అయితే మూవీ శాటిలైట్ హక్కులు మాత్రం జీ నెట్‌వర్క్ కే దక్కాయని అప్పుడే తేలిపోయింది. తాజాగా జీ కన్నడ ఛానెల్ ఈ మూవీ ప్రోమో కూడా రిలీజ్ చేసింది. సినిమా టెలికాస్ట్ తేదీని అనౌన్స్ చేయకపోయినా.. త్వరలోనే అని మాత్రం చెప్పింది.

యూఐ ఓటీటీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లేనా?

నిజానికి ఏ కొత్త సినిమా అయినా ఇప్పుడు మొదట ఓటీటీలోకి, తర్వాతే టీవీలోకి వస్తోంది. యూఐ కూడా అలాగే వస్తుందని అభిమానులు భావించారు. డిజిటల్ హక్కులు ఎవరికి దక్కాయో మేకర్స్ వెల్లడించకపోయినా.. ప్రైమ్ వీడియోకు దక్కవచ్చని భావించారు. కానీ ఇప్పటి వరకూ దీనిపై స్పష్టత లేదు.

అంతేకాదు జీ కన్నడ ఛానెల్ త్వరలోనే అంటూ మూవీ ప్రోమో కూడా రిలీజ్ చేయడంతో ఓటీటీ రిలీజ్ కంటే ముందే టీవీ ప్రీమియర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ లెక్కన ఓటీటీ స్ట్రీమింగ్ ఇప్పట్లో లేనట్లేనా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి జీ నెట్‌వర్క్ కేవలం శాటిలైట్ హక్కులు మాత్రమే దక్కించుకున్నట్లు వాళ్ల ప్రోమో చూస్తే తెలుస్తోంది.

యూఐ డిజాస్టర్

ఉపేంద్ర డైరెక్ట్ చేసి నటించిన మూవీ యూఐ. ఈ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యూఐ మూవీ కేవలం రూ.45 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఉపేంద్ర సినిమాకు ఇదే అత్యధిక వసూళ్లయినా.. యూఐ బడ్జెట్ లో సగం కూడా కాకపోవడంతో మేకర్స్ నష్టపోయారు. డిసెంబర్ 20న రిలీజైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించినా.. తర్వాత వచ్చిన నెగటివ్ రివ్యూలతో వసూళ్లు పూర్తిగా పడిపోయాయి.

Whats_app_banner

సంబంధిత కథనం