Ugram OTT Release Date: ఉగ్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?-ugram ott release date announced by the makers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ugram Ott Release Date Announced By The Makers

Ugram OTT Release Date: ఉగ్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?

Hari Prasad S HT Telugu
May 31, 2023 02:03 PM IST

Ugram OTT Release Date: ఉగ్రం ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజులు కూడా కాకముందే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

ఉగ్రం మూవీ
ఉగ్రం మూవీ

Ugram OTT Release Date: అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ తన డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియోనే ట్విటర్ ద్వారా అనౌన్స్ చేసింది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఉగ్రం మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

నాంది కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా అల్లరి నరేష్ నటనకు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో సీఐ శివకుమార్ పాత్రలో నరేష్ కనిపించాడు. వరంగల్ లో వరుస మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతడు ఒదిగిపోయాడు.

ఈ ఉగ్రం మూవీ డిజిటల్ ప్రీమియర్ పై నరేష్ స్పందించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంటుందన్న ఆశాభావం అతడు వ్యక్తం చేశాడు.

ఉగ్రం ట్రైల‌ర్స్‌, టీజ‌ర్స్‌లో గ‌త సినిమాల‌కు భిన్నంగా పోలీస్ ఆఫీస‌ర్‌గా సీరియ‌ల్ రోల్‌లో అల్ల‌రి న‌రేష్ క‌నిపించ‌డంతో ఈ సినిమా ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది.

ఇక ఉగ్రం మూవీపై డైరెక్టర్ విజయ్ కనకమేడల కూడా స్పందించాడు. "సమాజంలోని సీరియస్ అంశాలను స్టోరీలుగా ఎంచుకొని వాటిని అర్థవంతమైనవిగా చిత్రీకరించడం ఓ డైరెక్టర్ పని అని నేను నమ్ముతాను. విలక్షణ నటుడిగా నరేష్ కు పేరుంది. ఈ ఉగ్రం మూవీలో అతడి నటన అద్భుతంగా ఉంటుంది.

ఈ యాక్షన్ డ్రామా మూవీపై ప్రేక్షకులు తమ ప్రేమాభిమానాలు చూపించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను" అని విజయ్ అన్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం