నీది కోరిక, వాళ్లది ప్రేమ- హీరో వేధింపులు, హీరోయిన్ ఏడుపు సీన్లతో బోల్డ్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ టీజర్-ugly story movie official teaser released hero nandu heroine avika gor impressed with performance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నీది కోరిక, వాళ్లది ప్రేమ- హీరో వేధింపులు, హీరోయిన్ ఏడుపు సీన్లతో బోల్డ్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ టీజర్

నీది కోరిక, వాళ్లది ప్రేమ- హీరో వేధింపులు, హీరోయిన్ ఏడుపు సీన్లతో బోల్డ్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ టీజర్

Sanjiv Kumar HT Telugu

నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా నటించిన బోల్డ్ థ్రిల్లర్ సినిమా అగ్లీ స్టోరీ. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన అగ్లీ స్టోరీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో అగ్లీ స్టోరీ టీజర్ మంచి వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. మరి అగ్లీ స్టోరీ టీజర్ విశేషాలపై ఇక్కడ లుక్కేద్దాం.

నీది కోరిక, వాళ్లది ప్రేమ- హీరో వేధింపులు, హీరోయిన్ ఏడుపు సీన్లతో బోల్డ్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ టీజర్

టాలీవుడ్ నటుడు, హీరో నందు, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ జంటగా నటించిన తెలుగు బొల్డ్ థ్రిల్లర్ సినిమా 'అగ్లీ స్టోరీ'. రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మించారు. అగ్లీ స్టోరీ సినిమాకు ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు.

అగ్లీ స్టోరీ టైటిల్ గ్లింప్స్

ఇప్పటికే విడుదలైన అగ్లీ స్టోరీ టైటిల్ గ్లింప్స్‌, 'హే ప్రియతమా' లిరికల్ సాంగ్ రిలీజ్ ఎక్సట్రాడినరీ రెస్పాన్స్ అందుకున్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అగ్లీ స్టోరీ టీజర్ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

పర్వర్ట్ క్యారెక్టర్‌తో

మంటల మీదుగా సిగరెట్ కాలుస్తున్న నందును 'అగ్లీ స్టోరీ' టీజర్‌లో ముందుగా పరిచయం చేశారు. అతడిది పర్వర్ట్ క్యారెక్టర్ అన్నట్టు సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత అవికా గోర్ పరిచయం జరిగింది. నందును కాకుండా అవికా గోర్ మరొక అబ్బాయిని ప్రేమిస్తుంది.

వాళ్లది ప్రేమ-నీది కోరిక

మరొకరిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నామని అవికా గోర్ చెప్పినా సరే నందు వదలడు. వేధిస్తాడు. 'వాళ్లది ప్రేమ, అందుకే కలుసుకున్నారు. నీది కోరిక, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావ్' అని డైలాగ్ వస్తుంటే స్క్రీన్ మీద అవికా గోర్ - రవితేజ మహాదాస్యం పెళ్లిని, మెంటల్ ఆస్పత్రిలో నందును చూపించారు.

బెడ్ మీద నందు, అవికా

కథలో ట్విస్టులతో పాటు చివర్లో అవికా గోర్ ప్రేమ కోసం నందు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి. మెంటల్ హాస్పిటల్ సీన్ తర్వాత నందు స్టైలిష్‌గా కనిపించడం, మళ్లీ అవికా గోర్ లైఫ్‌లోకి రావడం క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అలాగే, అగ్లీ స్టోరీ టీజర్ ఎండింగ్‌లో ఒకే బెడ్‌పై నందు, అవికా గోర్ ఉండే సీన్ ట్విస్ట్‌లా ఉంది.

అగ్లీ స్టోరీ నటీనటులు

నందును అసహ్యించుకునే అవికా గోర్ బెడ్ మీద ఉండటానికి కారణాలు ఏంటనేవి సస్పెన్సింగ్‌గా ఉన్నాయి. టీజర్ అంతా బోల్డ్, వేధింపులు, ఏడుపు సీన్లతో సాగింది. నందు, అవికా గోర్ నటన బాగుంది. వీరితోపాటు అగ్లీ స్టోరీ సినిమాలో శివాజీ రాజా, రవితేజ మహదాస్యం, ప్రజ్ఞ లాంటి టాలెంటెడ్ కాస్ట్ నటిస్తున్నారు.

అగ్లీ స్టోరీ టెక్నిషియన్స్

సినిమాటోగ్రఫీ శ్రీ సాయికుమార్ దారా, కొరియోగ్రఫీ ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్ శ్రీకాంత్ పట్నాయక్, సోమ మిథున్, ఆర్ట్ డైరెక్షన్ విఠల్ కోసనం, పీఆర్ఓ మధు వీఆర్ లాంటి టీమ్ ఈ ప్రాజెక్ట్‌కి స్ట్రెంగ్త్ యాడ్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో అగ్లీ స్టోరీ టీజర్ ట్రెండింగ్ అవడం విశేషంగా మారింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం