Ugadi Wishes 2025 From SRH Nithin Sreeleela David Warner: ఇవాళ ఉగాది. ఈ పర్వదినాన అందరూ ఉగాది సంబురాలు చేసుకుంటారు. అలాగే, బంధుమిత్రులు అందరికి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను పలు విధాలుగా తెలియజేస్తుంటారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. ఇవాళ (మార్చి 30) విశాఖపట్నం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు తలపడనుంది. మధ్యాహ్నాం మూడున్నర గంటలకు డీసీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ 2025 మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో గ్రౌండ్‌లో నుంచి సన్ రైజర్స్ హైదరబాద్ టీమ్ అంతా తెలుగు ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా నితీష్ కుమార్ రెడ్డి "తెలుగు ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు" అని తెలుగులో విషెస్ చెప్పాడు. ఆ తర్వాత "హే ఆరెంజ్ ఆర్మీ, హ్యాపీ ఉగాది" పాట్ కమిన్స్ ఉగాది విషెస్ తెలియజేశాడు.
ఆ తర్వాత జయదేవ్ ఉనద్కత్, హెన్రిచ్ క్లాసెన్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, అభిషేక్ శర్మ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారిక పేజీలో షేర్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతోపాటు మరో వీడియోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఎక్స్‌లో పంచుకుంది.
ఈ వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ "ఎస్ఆర్‌హెచ్ నుంచి ఉగాది శుభాకాంక్షలు" అని ముందుగా చెప్పాడు. ఆ తర్వాత ఆడమ్ జంపా "ఎస్ఆర్‌హెచ్ కుటుంబం నుంచి అందరికి ఉగాది శుభాకాంక్షలు" అని అన్నాడు. అనంతరం నితీష్ కుమార్ రెడ్డి తెలుగులో విషెస్ తెలియజేశాడు. అనంతరం అభినవ్ మనోహర్ ఉగాది శుభాకాంక్షలు చెప్పాడు.
ఇలా ఒక్కొక్కరు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ చెప్పిన తర్వాత వీడియోలో హీరో నితిన్ కనిపించాడు. "ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు" అని నితిన్ తెలిపాడు. ఆ వెంటనే డ్యాన్సింగ్ క్వీన్, హీరోయిన్ శ్రీలీల "తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు" అని చెప్పింది. వీరిద్దరి తర్వాత వెంటనే డేవిడ్ వార్నర్ ఉగాది విషెస్ చెప్పబోతూ నవ్వించాడు.
"అందరికి హాయ్. ఐ విషింగ్ యూ హ్యాపీ ఉ.. ఉ.." అని అనబోతు ఉగాది అని చెప్పలేకపోయాడు డేవిడ్ వార్నర్. దాంతో నితిన్, శ్రీలీల డేవిడ్ వార్నర్ ఉగాది అనరాకుండా పడిన కష్టాన్ని చూసి నవ్వేశారు. తర్వాత వారు కరెక్ట్ చేయడంతో "హ్యాపీ ఉగాది" అని సింపుల్‌గా విషెస్ చెప్పాడు. తర్వాత ఇదే వీడియోలో "మన టీమ్‌కు ఇషాన్ కిషన్ స్పైసీని తీసుకొస్తాడు" అని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు.
ఆ వెంటనే "ఈ ఉగాదికి ఎస్ఆర్‌హెచ్‌కి స్పైసీ తెచ్చే ఫ్లేవర్ ఎవరంటే అది నేను.." అని నవ్వుతూ చెప్పాడు నితీష్ కుమార్ రెడ్డి. దీంతో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, నితిన్, శ్రీలీలతో పాటు రాబిన్‌హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం