Anita Hassanandani: 8 ఏళ్లకు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోన్న ఉదయ్ కిరణ్ నువ్వు నేను హీరోయిన్ అనిత- ఎంతలా మారిపోయిందో చూశారా?
Anita Hassanandani Reddy Re Entry In Tollywood: సుమారు 8 ఏళ్ల తర్వాత ఉదయ్ కిరణ్ నువ్వు నేను మూవీ హీరోయిన్ అనిత హస్సానందని రెడ్డి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే, అప్పటికి ఇప్పటికీ ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. మరి ఆ సినిమా ఏంటీ అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Anita Hassanandani Reddy Re Entry Movie: ఉదయ్ కిరణ్ నటించిన రొమాంటిక్ డ్రామా లవ్ స్టోరీ మూవీ నువ్వు నేను మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనిత హస్సానందని రెడ్డి. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన నువ్వు నేను సినిమా ఉదయ్ కిరణ్, అనిత ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది.
రెండు తెలుగు సినిమాలు
2001లో వచ్చిన నువ్వు నేను తర్వాత 2008లో ఇది సంగతి, 2016లో మనలో ఒకడు వంటి రెండు తెలుగు సినిమాలు మాత్రమే చేసింది అనిత హస్సానందని రెడ్డి. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో మరే సినిమా అనిత చేయలేదు. బాలీవుడ్‌లో మాత్రం యారన్ దా క్యాచప్, రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2, యే దిల్‌తోపాటు ఓటీటీ వెబ్ సిరీస్‌ల్లో యాక్ట్ చేసింది.
8 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కి
అనంతరం కుమారుడు ఆరవ్‌కు జన్మనిచ్చిన తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకుంది. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది అనిత. అయితే, తెలుగు ఆడియెన్స్‌కు మాత్రం 8 ఏళ్ల తర్వాత కనిపించనుంది అనిత. ఈ గ్యాప్‌లో అనిత హస్సానందని రెడ్డి చాలా మారిపోయిందని చెప్పాలి. అప్పుడు క్యూట్‌గా కనిపించిన అనిత ఇప్పుడు మరింత హాట్‌గా ఫొటోలు షేర్ చేస్తుంటుంది.
రొమాంటిక్ కామెడీ జోనర్‌లో
ఇక అనిత హస్సానందని రెడ్డి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా ఓ భామ అయ్యో రామ. సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీనే ఓ భామ అయ్యో రామ. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓ భామ అయ్యో రామ గ్లింప్స్
రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా మాళవిక మనోజ్ హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే, ఈ సినిమాలో అనిత ఒక కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఓ భామ అయ్యో రామ మూవీ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో హీరో హీరోయిన్ ఒక కారులో ఒకరిని ఒకరు టీస్ చేసుకుంటూ సరదాగా ఉన్న సమయంలో కార్ బ్రేకులు పనిచేయక ఆ పరిస్థితి మారిపోయి మరో దిశగా పరిస్థితులు వెళ్తుంటాయి.
ఇక ఓ భామ అయ్యో రామ సినిమాకు రాదన్ సంగీతాన్ని అందిస్తుండగా మణికంఠం ఎస్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. భవిన్ షా ఎడిటింగ్ చేయనున్నారు. అంతేకాకుండా ఎందరో అనుభవజ్ఞులు ఈ చిత్రానికి సాంకేత బృందంగా వ్యవహరిస్తున్నారు.