Web Series OTT: ఈ వారం ఓటీటీల్లో రెండు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‍లు.. పంచాయత్ తెలుగు రీమేక్ సిరీస్‍తో పాటు మరొకటి..
OTT Web Series: ఈ వారం రెండు వెబ్ సిరీస్‍లు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఐకానిక్ సిరీస్ పంచాయత్‍కు తెలుగు రీమేక్ సివరిపల్లి ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. డ్రీమ్స్ బ్యాక్‍డ్రాప్‍లో మరో సిరీస్ రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఓటీటీల్లో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‍లు అడుగుపెడుతున్నాయి. ఈ వీకెండ్ చూసేందుకు ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఫుల్ పాపులర్ అయిన హిందీ వెబ్ సిరీస్ పంచాయత్‍కు తెలుగు రీమేక్‍గా సివరపల్లి రూపొందింది. ఈ సిరీస్ ఈ వారమే స్ట్రీమింగ్‍కు రానుంది. స్వీట్ డ్రీమ్స్ అనే మరో సిరీస్ డిఫరెంట్ కథతో ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 24న ఒకే రోజు వేర్వేరు ఓటీటీల్లో రానున్న ఈ రెండు వెబ్ సిరీస్‍ల వివరాలు ఇవే..
సివరపల్లి
హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ నేషనల్ రేంజ్‍లో పాపులర్ అయింది. ఈ రూరల్ కామెడీ డ్రామా సిరీస్‍లో ఇప్పటి వరకు మూడు సీజన్లు భారీ సక్సెస్ అయ్యాయి. ఇంత క్రేజ్ ఉన్న సిరీస్‍కు తెలుగు రీమేక్‍గా ‘సివరపల్లి’ రూపొందింది. పంచాయత్ తొలి సీజన్‍లో ఉన్న స్టోరీతో ఈ సిరీస్ వస్తోంది. సివరపల్లి సిరీస్ ఈవారంలోనే జనవరి 24వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.
సివరపల్లి సిరీస్‍లో రాగ్‍మయూర్ ప్రధాన పాత్ర పోషించారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలని కలలు కనే యువకుడు.. తెలంగాణలోని సివరపల్లి గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా వస్తాడు. ఇష్టం లేకున్నా ఉద్యగంలో చేరతాడు. ఈ గ్రామంలో అతడు ఎదుర్కొనే పరిస్థితులు, సవాళ్లు, అక్కడి జనాలు, రాజకీయాల చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. కామెడీ ప్రధానంగా ఈ సిరీస్ ఉండనుంది.
సివరపల్లి వెబ్ సిరీస్‍కు భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. రాగ్‍మూయూర్‌తో పాటు రూపలక్ష్మి, మురళీధర్ గౌడ్, ఉదయ్ గుర్రాల, పావని కరణం, సన్నీ పల్లె కీలకపాత్రలు పోషించారు. పంచాయత్ సిరీస్‍ను ప్రొడ్యూజ్ చేసిన టీవీఎఫ్ క్రియేషన్స్ తెలుగు రీమేక్ సివరపల్లిని కూడా నిర్మించింది. జనవరి 24వ తేదీ నుంచి ఈ సిరీస్‍ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఈ సిరీస్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందోనని ఆసక్తి నెలకొంది.
స్వీట్ డ్రీమ్స్
స్వీట్ డ్రీమ్స్ వెబ్ సిరీస్ జనవరి 24వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. కలలో కనిపించిన అమ్మాయి, అబ్బాయి నిజజీవితంలోనూ కలిసేందుకు చేసే ప్రయత్నం, వారి ప్రేమ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్‍లో అమోల్ పరాశర్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రలు పోషించారు.
కెన్నీ (అమోల్ పరాశర్), దియా (మిథిలా పాల్కర్)కు ఓ కల వస్తుంది. ఇద్దరి కలలో ఒకరినొకరు చూసుకొని ఇష్టపడతారు. ఒకరి కోసం ఒకరు వెతుకుతారు. ఇద్దరూ కలుస్తారు. ఒకరినొకరు ఇష్టపడతారు. కెన్నీకి అప్పటికే ఓ బ్రేకప్ అయి ఉంటుంది. దియాకు కూడా కొన్ని సవాళ్లు ఉంటాయి. కెన్నీ, దియా పరిచయం ముందుకు ఎలా సాగింది.. ప్రేమలో పడ్డారా.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే అంశాల చుట్టూ స్వీట్ డ్రీమ్స్ స్టోరీ సాగుతుంది. ఈ సిరీస్‍కు విక్టర్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అమోల్, మిథిలాతో పాటు మియాంగ్ చాంగ్, మోహినీ షింపీ, అయేషా అద్లఖా కీరోల్స్ చేశారు. ఈ సిరీస్‍ను జ్యోతి దేశ్‍పాండే, నేహా ఆనంద్, ప్రంజల్ ఖండాదియా ప్రొడ్యూజ్ చేశారు. స్వీట్ డ్రీమ్స్ సిరీస్ జనవరి 24 డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టనుంది.
సంబంధిత కథనం
టాపిక్