TV Premiers: సంక్రాంతికి మూడు టీవీ ఛానెల్స్‌లో మూడు బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఎక్కడ చూడాలంటే?-tv premiers for sankranthi kalki 2898 ad committee kurrollu mathu vadalara 2 on etv star maa zee telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tv Premiers: సంక్రాంతికి మూడు టీవీ ఛానెల్స్‌లో మూడు బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఎక్కడ చూడాలంటే?

TV Premiers: సంక్రాంతికి మూడు టీవీ ఛానెల్స్‌లో మూడు బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jan 08, 2025 05:28 PM IST

TV Premiers: సంక్రాంతికి థియేటర్లలోనే కాదు.. టీవీల్లోనూ బ్లాక్ బస్టర్ సినిమాల జాతర ఉండనుంది. ఈ పండుగ సంబురాల్లో భాగంగా టాప్ తెలుగు టీవీ ఛానెల్స్ గతేడాది థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ అయిన మూడు సినిమాలను టెలికాస్ట్ చేయనున్నాయి.

సంక్రాంతికి మూడు టీవీ ఛానెల్స్‌లో మూడు బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఎక్కడ చూడాలంటే?
సంక్రాంతికి మూడు టీవీ ఛానెల్స్‌లో మూడు బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఎక్కడ చూడాలంటే?

TV Premiers: ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి మూడు టీవీ ఛానెల్స్ లో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు టీవీ ప్రీమియర్ కు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ గతేడాది రిలీజైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. వీటిలో కల్కి 2898 ఏడీతోపాటు కమిటీ కుర్రోళ్లు, మత్తు వదలరా 2 సినిమాలు ఉన్నాయి. మరి వీటిని ఏ ఛానెల్లో ఎప్పుడు చూడాలో తెలుసుకోండి.

yearly horoscope entry point

సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ బొనాంజా

సంక్రాంతి వస్తుందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి సహజమే. అటు టీవీ ఛానెల్స్ కూడా తమ ప్రేక్షకులను పండుగ సంబరాల్లో ముంచేస్తాయి. అందులో భాగంగా ఈసారి కూడా మూడు సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి. జీ తెలుగు ఛానెల్లో గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటైన కల్కి 2898 ఏడీ టెలికాస్ట్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ పాన్ ఇండియా మూవీ టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా వచ్చే ఆదివారం (జనవరి 12) సాయంత్రం 5.30 గంటలకు ప్రసారం కానుంది.

ఇక స్టార్ మాలో మరో సూపర్ హిట్ మూవీ మత్తు వదలరా 2 ప్రసారం చేయబోతున్నారు. గతేడాది రిలీజైన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. మత్తు వదలరా మూవీకి సీక్వెల్ గా వచ్చి ఆకట్టుకుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. వచ్చే ఆదివారం (జనవరి 12) మధ్యాహ్నం 1 గంటకు స్టార్ మాలో ప్రసారం అవుతుంది.

అటు ఈటీవీ కూడా మరో హిట్ మూవీతో వస్తోంది. లోబడ్జెట్ మూవీ కమిటీ కుర్రోళ్లు ఈటీవీలో టెలికాస్ట్ కానుంది. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వరల్డ్ టీవీ ప్రీమియర్ మాత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న మధ్యాహ్నం 1 గంటకు కానుంది.

ఈ సినిమాలే కాకుండా వివిధ ఛానెల్స్ లో సంక్రాంతి సంబరాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. జీ తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ సందడి చేయనుంది.

థియేటర్లలోనూ సినిమాల జాతర

ఇక ఈ సంక్రాంతికి ఎప్పటిలాగే థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు క్యూ కడుతున్నాయి. మొదట శుక్రవారం (జనవరి 10) రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

దీని తర్వాత ఆదివారం (జనవరి 12) బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అవుతుంది. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా అతని ఫ్యాన్స్ లో ఆశలు రేపుతోంది. చివరికి సంక్రాంతి రోజు జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది.

Whats_app_banner