TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ థ్రిల్లర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే-tv news sundeep kishan and varsha bollamma ooru peru bhairavakona to telecast on zee telugu tv channel on june 30 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tv Premiere: టీవీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ థ్రిల్లర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే

TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ థ్రిల్లర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jun 23, 2024 04:39 PM IST

Ooru Peru Bhairavakona TV Premiere: ఊరు పేరు భైరవకోన సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది. టెలికాస్ట్ టైమ్, డేట్ ఫిక్స్ అయ్యాయి. ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది.

TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ థ్రిల్లర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే
TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ థ్రిల్లర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే

Ooru Peru Bhairavakona: ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి అంచనాలకు తగ్గట్టే కలెక్షన్లు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కాయి. అయితే, ఇప్పుడు ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. టెలికాస్ట్ వివరాలు కూడా బయటికి వచ్చాయి.

టెలికాస్ట్ డేట్, టైమ్

‘ఊరు పేరు భైరవకోన’ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జూన్ 30వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‍లో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ నేడు (జూన్ 23) అధికారికంగా వెల్లడించింది. టీవీ ప్రీమియర్ ప్రోమో రిలీజ్ చేసింది.

ఓటీటీలో ఎక్కడ..

‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. మార్చి 8న తేదీన ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ సినిమా ఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్లు టాప్-5లో ఈ చిత్రం ట్రెండ్ అయింది.

ఊరు పేరు భైరవకోన చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఓ మిస్టరీ గ్రామం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. హారర్, కామెడీతో పాటు లవ్ స్టోరీ కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది. ఈ మూవీ ట్రైలర్‌తో ఇంట్రెస్ట్ కలిగించింది. ఆ తర్వాత రిలీజ్ అయ్యాక కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

ఊరు పేరు భైరవకోన మూవీలో సందీప్, వర్షతో పాటు కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్, బ్రహ్మాజీ, వడివుక్కరసి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించగా.. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర సమర్పించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు.

కలెక్షన్లు ఇలా..

ఊరు పేరు భైరవకోన సినిమాకు ఆశించిన స్థాయిలోనే కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ సుమారు రూ.25కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ భారీగా చేసింది. అందుకు తగట్టే సినిమా కూడా ఆకట్టుకోవడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి.

సందీప్ కిషన్ లైనప్

సందీప్ కిషన్ ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రాజెక్ట్ జెడ్ సినిమాకు సీక్వెల్‍లో సందీప్ కిషన్ హీరోగా చేయనున్నారు. ‘మాయా వన్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు సీవీ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 2017లో వచ్చిన మాయావన్‍ (తెలుగులో ప్రాజెక్ట్ జెడ్)కు సీక్వెల్‍గా ఇది వస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా రూపొందనుంది.

Whats_app_banner