TV Actress: హోలీ పండుగలో బుల్లితెర నటిపై సహ నటుడి లైంగిక వేధింపులు, శారీరక ఘర్షణ.. ఎవరు ఆపగలరో చూస్తానంటూ మీద మీదకు!
TV Actress Accuses Co Star For Molestation In Holi Festival: హోలీ పండుగ వేడుకల్లో లైంగిక వేధింపులు చోటుచేసుకున్నాయి. ముంబైలోని ఓ హోలీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌లో తన సహ నటుడు లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బుల్లితెర నటి ఆరోపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
TV Actress Accuses Co Star For Molestation In Holi Festival: హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో సంబురంగా జరుపుకుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా సంతోషంగా రంగులు పూసుకుంటూ హోలీ జరుపుకున్నారు. అయితే, ఈ హోలీ వేడుకల్లో అసభ్య ప్రవర్తన చోటుచేసుకుంది.
అనుచితంగా తాకినట్లు
ముంబైలోని హోళీ పండుగ వేడుకల్లో సహనటుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక బుల్లితెర నటి ఆరోపించింది. ఈ విషయాన్ని ఎన్డీటీవీకి పోలీసు అధికారులు తెలిపారు. ముంబై జోగేశ్వరిలో సదరు నటి పనిచేస్తున్న సంస్థ నిర్వహించిన ఓ రూఫ్‌టాప్ పార్టీలో 29 ఏళ్ల సహనటుడు (ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో పనిచేస్తున్నాడు) బలవంతంగా తన ముఖంపై రంగులు వేసి, అనుచితంగా తాకినట్లు ఆమె పేర్కొంది.
మద్యం సేవించి వెంబడించి
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో టెలివిజన్ నటి హోలీ పార్టీలో జరగిన సంఘటనను వివరించింది. తన సహనటుడు మద్యం సేవించి, ఆమెను వెంబడించినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆమె ఒక స్టాల్ వెనుక దాక్కున్నప్పటికీ ఆమె వద్దకు వచ్చి ముఖంపై, బుగ్గలపై చేతితో రంగులు పూశాడని నటి పేర్కొంది. ఆ పార్టీలో అనేక మహిళలపై కూడా అతను అనుచితంగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించింది.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ
అంతేకాకుండా తనను ఎవరు ఆపగలరో చూస్తాను అంటూ నటి మీద మీదకు వచ్చినట్లు ఆమె తెలిపింది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దగ్గరకు రాకుండా నన్ను ఎవరు ఆపగలరో చూస్తాను" అని తన సహనటుడు చెప్పాడని ఆ బుల్లితెర నటి వెల్లడించింది. వద్దని అతన్ని నెట్టివేస్తున్నప్పటికీ సహనటుడు బలవంతంగా తనను అనుచితంగా తాకడం మొదలుపెట్టినట్లు నటి ఫిర్యాదులో పేర్కొంది.
నటి ఫ్రెండ్స్‌ను నెట్టేసి
ఈ ఘటనతో ఆమె షాక్ అయినట్లు చెప్పింది. తాను మెంటల్‌గా షాక్ అయినట్లు, అప్సట్ అయినట్లు తన స్నేహితులకు చెప్పినట్లు నటి పేర్కొంది. దాంతో అతన్ని తన ఫ్రెండ్స్ ఎదుర్కొన్నారని, కానీ, వారిని కూడా నటుడు నెట్టి వేసినట్లు, వారి మధ్య శారీరక ఘర్షణ జరిగినట్లు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో నటి ఆరోపించింది.
సెక్షన్ 75(1)(i) కింద కేసు
బుల్లితెర నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు నటుడిపై పలు సెక్షన్స్ నమోదు చేశారు. బిఎన్‌ఎస్‌లోని సెక్షన్ 75(1)(i) కింద కేసు నమోదు చేసి నిందితుడికి నోటీసు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు జరుగుతోంది. ఆ నటుడిపై నటితోపాటు ఆమె స్నేహితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్
నటి, ఆమె స్నేహితుల ఫిర్యాదుతో భారతీయ న్యాయ సంహితలోని లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్ 75(1)(i) కింద ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది.
సంబంధిత కథనం