Actor Dies: 25ఏళ్లకే హార్ట్ ఎటాక్‍తో నటుడు మృతి
TV Actor Pawan Dies: 25 ఏళ్ల వయసులోనే గుండెపోటు కారణంగా ఓ యువ నటుడు మృతి చెందారు. ఆ వివరాలివే..
TV Actor Pawan Dies: సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. హార్ట్ ఎటాక్‍ల వల్ల సంభవిస్తున్న మరణాలు షాక్‍కు గురి చేస్తున్నాయి. చిన్న వయసులోనే కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా.. హిందీ, తమిళ టీవీ యాక్టర్ పవన్ హార్ట్ ఎటాక్ కారణంగా హఠాత్తుగా మృతి చెందారు. 25 ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన కన్నుమూశారు. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
హార్ట్ ఎటాక్ రావటంతో పవన్ శుక్రవారం ముంబైలో మృతి చెందారు. ఆయన సొంత ఊరు కర్ణాటకలోని మాండ్యా జిల్లా. సరస్వతి, నాగరాజు ఆయన తల్లిదండ్రులు. యాక్టింగ్ నిమిత్తం కొంతకాలంగా పవన్ ముంబైలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆయన మృతి చెందారు. పవన్ మృత దేహాన్ని స్వస్థలానికి తరలించినట్టు తెలుస్తోంది. పవన్ హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఒక్కసారిగా షాక్‍లో ఉన్నారు.
పవన్ ఇప్పటికే చాలా హిందీ, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ మృతి పట్ల కొందరు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాండ్యా ఎమ్మెల్యే హెచ్‍టీ మంజు, మాజీ ఎమ్మెల్యే కేబీ చంద్రశేఖర విచారం వ్యక్తం చేశారు. మరికొందరు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి తెలిపారు.
ఇటీవల కన్నడ ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన.. థాయ్‍ల్యాండ్ వెకేషన్‍లో ఉండగా చనిపోయారు. హార్ట్ ఎటాక్‍తో ఆమె కూడా హఠాత్తుగా కన్నుమూశారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021లో గుండె పోటుతోనే మృతి చెందారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది.