Tushar Deshpande Wedding: స్కూల్ ఫ్రెండ్‌ను పెళ్లాడ‌బోతున్న‌ సీఎస్‌కే పేస‌ర్ తుషార్ దేశ్‌పాండే-tushar deshpande to tied the knot his school friend nabha gaddamwar on monday wedding pics viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Tushar Deshpande To Tied The Knot His School Friend Nabha Gaddamwar On Monday Wedding Pics Viral

Tushar Deshpande Wedding: స్కూల్ ఫ్రెండ్‌ను పెళ్లాడ‌బోతున్న‌ సీఎస్‌కే పేస‌ర్ తుషార్ దేశ్‌పాండే

HT Telugu Desk HT Telugu
Jun 13, 2023 11:13 AM IST

Tushar Deshpande Wedding: చెన్నై సూప‌ర్ కింగ్స్ పేస‌ర్ తుషార్ దేశ్‌పాండే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త‌న స్కూల్ ఫ్రెండ్ న‌భాతో పెళ్లిపీట‌లెక్క‌బోతున్నాడు. అత‌డి ఎంగేజ్‌మెంట్ సోమ‌వారం ముంబ‌యిలో జ‌రిగింది..

తుషార్ దేశ్‌పాండే, న‌భా
తుషార్ దేశ్‌పాండే, న‌భా

Tushar Deshpande Wedding: చెన్నై సూప‌ర్ కింగ్స్ పేస‌ర్ తుషార్ దేశ్‌పాండే సెకండ్ ఇన్నింగ్ మొద‌లుపెట్ట‌బోతున్నాడు. అయితే క్రికెట్‌లో కాదు రియల్ లైఫ్ లో. తుషార్ దేశ్‌పాండే ఓ ఇంటివాడుకాబోతున్నాడు. సోమ‌వారం త‌న చిర‌కాల ప్రియురాలు న‌భాగ‌డ్డంవార్ తో అత‌డి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌కు ప‌లువురు చెన్నై సూప‌ర్ కింగ్స్ క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు

ట్రెండింగ్ వార్తలు

తుషార్‌, న‌భా పెళ్లి ఎంగేజ్‌మెంట్ ఫొటోను సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ శివ‌మ్ దూబే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్కూల్ డేస్ నుంచి తుషార్‌, న‌భాకు మ‌ధ్య ప‌రిచ‌యం ఉంద‌ట‌. న‌భాతో ఎంగేజ్‌మెంట్‌ గురించి తుషార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

స్కూల్ క్ర‌ష్ నుంచి త‌న భార్య‌గా న‌భా ప్ర‌మోష‌న్ పొంద‌నుంద‌ని పేర్కొన్నాడు. కొత్త జంట‌కు సూర్య‌కుమార్ యాద‌వ్‌, రుతురాజ్ గైక్వాడ్‌తో పాలు ప‌లువురు క్రికెట‌ర్లు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు. త‌మ ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను తుషార్ కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇర‌వై ల‌క్ష‌ల బేస్ ధ‌ర‌కు తుషార్ దేశ్‌పాండే ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. త‌న‌కు ధ‌ర‌కు ప‌దింత‌ల న్యాయం చేశాడు తుషార్‌. అద్భుత బౌలింగ్‌తో అద‌ర‌గొట్టిన తుషార్ ఈ సీజ‌న్‌లో ప‌ద‌హారు మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఒకానొక ద‌శ‌లో ప‌ర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు.

అద్భుత బౌలింగ్‌తో చెన్నై క‌ప్ గెల‌వ‌డంతో తుషార్ దేవ్‌పాండే త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. గ‌త సీజ‌న్‌లో పెద్ద‌గా అవ‌కాశాలు రాకా బెంచ్‌కు ప‌రిమిత‌మైన తుషార్ ఈ సీజ‌న్‌లో మాత్రం చెల‌రేగిపోయాడు.

WhatsApp channel