Mammootty Turbo OTT: మమ్ముట్టి టర్బో మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mammootty Turbo OTT: మమ్ముట్టి టర్బో మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.రెండు రోజుల్లో 10 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. టర్బో మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mammootty Turbo OTT: టర్బో మూవీతో ఈ వారమే థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. గత కొన్నాళ్లుగా ప్రయోగాత్మక కథాంశాలకు ప్రాధాన్యతనిస్తోన్న మమ్ముట్టి టర్బోలో ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో కనిపించాడు. టర్బో మూవీలో కన్నడ హీరో రాజ్ బీ శెట్టి విలన్‌గా కనిపించాడు. టాలీవుడ్ కమెడియన్ సునీల్ టర్బో మూవీతోనే మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించాడు. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్సడ్ టాక్‌ను తెచ్చుకున్నది. మమ్ముట్టి నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తదనం టర్బో మూవీలో కనిపించలేదనే విమర్శలు వినిపిస్తోన్నాయి. ఔట్‌డేటెడ్ స్టోరీతో దర్శకుడు వైశాఖ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో మూవీకి నెగెటివ్ టాక్ వస్తోంబది.
25 కోట్లకు ఓటీటీ రైట్స్...
మలయాళంలో మమ్ముట్టి సినిమాలకు ఉన్న క్రేజ్ కారణంగా రిలీజ్‌కు ముందే టర్బో మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. దాదాపు 25 కోట్లకు టర్బో ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు చెబుతోన్నారు. థియేటర్లలో రిలీజైన నాలుగు నుంచి ఆరు వారాల్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో అమెజాన్ ప్రైమ్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ డీల్ ప్రకారం టర్బో మూవీ జూన్ 28 లేదా జూలై 5న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
తెలుగులో కూడా...
థియేటర్లలో కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే రిలీజైంది. ఓటీటీలో మాత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో టర్బో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
మమ్ముట్టి ప్రొడ్యూసర్....
టర్బో మూవీని మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై నలభై ఐదు కోట్ల బడ్జెట్‌తో మమ్ముట్టి నిర్మించాడు. మమ్ముట్టి ప్రొడ్యూసర్‌గా నిర్మించిన సినిమాల్లో బడ్జెట్ పరంగా టర్బో అతిపెద్ద మూవీ కావడం గమనార్హం. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు టర్బో మూవీకి 6.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు మాత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. 3.75 కోట్ల వసూళ్లను మాత్రమే ఈ మూవీ రాబట్టింది.
టర్బో మూవీ కథ ఇదే...
టర్బో జోస్ (మమ్ముట్టి) ఓ జీప్ డ్రైవర్. టర్బో జోస్ స్నేహితుడు జెర్రీ ఇందులేఖ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పెద్దలను ఎదురించి టర్బో జోస్ వారి పెళ్లి జరిపిస్తాడు. చెన్నైకి చెందిన పొలిటికల్ కింగ్ మేకర్ షణ్ముగ సుందరం (రాజ్ బీ శెట్టి) కారణంగా జెర్రీ, ఇందులేఖ చిక్కుల్లో పడతారు. వారిని కాపాడేందుకు చెన్నై వచ్చిన టర్బోకు ఎలాంటి నిజాలు తెలిశాయి? తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న షణ్ముగ సుందరాన్ని సాధారణ జీప్ డ్రైవర్ అయిన టర్బో జోస్ ఎలా ఎదురించాడు? ఈ పోరాటంలో టర్బో జోస్ విజయం సాధించాడా లేదా అన్నదే ఈ మూవీ కథ.
టర్బో జోస్‌లో మమ్ముట్టి నటనతో పాటు రాజ్ బీ శెట్టి విలనిజం పడించిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే పేరు వచ్చింది.
హ్యాట్రిక్ హిట్స్...
మమ్ముట్టి హీరోగా నటించిన గత సినిమాలు కన్నూర్ స్క్వాడ్, కాథల్ ది కోర్, భ్రమయుగం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. కాథల్ ది కోర్‌లో స్వలింగసంపర్కుడిగా, భ్రమయుగంలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అసమాన నటనతో మమ్ముట్టి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నాడు. తెలుగులో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన యాత్ర 2లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మమ్ముట్టి కనిపించాడు. ప్రస్తుతం మలయాళంలో నాలుగు సినిమాలు చేస్తూ మమ్ముట్టి బిజీగా ఉన్నాడు.