హాట్ మూవ్స్‌తో రెచ్చిపోయిన ర‌ష్మిక‌.. ఆయుష్మాన్‌తో రొమాన్స్‌.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న థామా సాంగ్‌..కోటి వ్యూస్-tum mere na huye song from thamma movie rashmika mandanna hot moves ayushman romance viral video on youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హాట్ మూవ్స్‌తో రెచ్చిపోయిన ర‌ష్మిక‌.. ఆయుష్మాన్‌తో రొమాన్స్‌.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న థామా సాంగ్‌..కోటి వ్యూస్

హాట్ మూవ్స్‌తో రెచ్చిపోయిన ర‌ష్మిక‌.. ఆయుష్మాన్‌తో రొమాన్స్‌.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న థామా సాంగ్‌..కోటి వ్యూస్

థామా అనే హారర్ థ్రిల్లర్ బాలీవుడ్ మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రష్మిక మందన్న రాబోతుంది. దీపావళికి సినిమా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన వీడియో సాంగ్ లో రష్మిక హాట్ మూవ్స్ తో రెచ్చిపోయింది.

సాంగ్ లో రష్మిక డ్యాన్స్ మూవ్స్ (youtube)

వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తన లెవల్ ను పెంచుకుంటూ పోతుంది రష్మిక మందన్న. 2025లో ఇప్పటికే ఛావా, సికందర్, కుబేర సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఆమె.. ఇప్పుడు థామా అంటూ హారర్ కామెడీ థ్రిల్లర్ తో రెడీ అయింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది.

హాట్ గా రష్మిక

థామా టీజర్, ట్రైలర్, గ్లింప్స్ ఇలా అన్ని రష్మిక మందన్న చూట్టే సాగుతున్నాయి. ఇందులో ఆమె పోస్టర్లు, స్టిల్స్, సాంగ్స్ హాట్ హాట్ గా ఉన్నాయి. హీరోగా ఆయుష్మాన్ ఖురానా ఉన్నా థామా సినిమాపై రష్మిక మందన్న ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. తాజాగా థామా సినిమా నుంచి ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హాట్ మూవ్స్ తో రష్మిక అదరగొట్టింది.

అదిరే డ్యాన్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మంచి డ్యాన్సర్ కూడా. థామా నుంచి రిలీజైన ‘తుమ్ మెరే నా హుయే’ హిందీ వీడియో సాంగ్ లో అది మరోసారి ప్రూవ్ అయింది. హాట్ మూవ్స్ తో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతోంది రష్మిక. ఈ సాంగ్ లో రష్మిక అందాలు, ఆయుష్మాన్ ఖురానాతో రొమాన్స్ కలిసి ఆడియన్స్ తో విజిల్స్ కొట్టిస్తున్నాయి.

కోటి వ్యూస్

థామా నుంచి తుమ్ మెరే నా హుయే సాంగ్ సోమవారం (సెప్టెంబర్ 29)న యూట్యూబ్ లో రిలీజైంది. 24 గంటలు కూడా కాకముందే ఈ సాంగ్ ఇప్పటికే కోటి వ్యూస్ ను అందుకుంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రష్మిక అందం, డ్యాన్స్, హాట్ నెస్ తో ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సాంగ్ తో థామా మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

వాంపైర్ గా

థామా సినిమాలో హీరో వాంపైర్ గా మారిపోతాడు. కోరళ్ల పొడుచుకు వచ్చే పళ్లతో, సూపర్ పవర్స్ తో అతని జీవితం తలకిందులుగా మారిపోతుంది. ఈ సినిమాలో రష్మిక కూడా సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న అమ్మాయిగానే కనిపించనుందని టాక్. హారర్ కామెడీ థ్రిల్లర్ థామా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానుంది.

థామా సినిమాలో రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా, పరేశ్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖి, ఫైజల్ మాలిక్, రచిత్ సింగ్ తదితరులు నటించారు. దీనికి ఆదిత్య సర్పోదార్ డైరెక్టర్. దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం