Producer: ఐటీ మల్టీపుల్ కంపెనీలో పనిచేస్తుండేవాడిని.. ఫాంటసీ థ్రిల్లర్ నచ్చడంతో.. నిర్మాత రాహుల్ రెడ్డి కామెంట్స్-tuk tuk producer rahul reddy comments on his career and movie director supreeth krishna court success ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Producer: ఐటీ మల్టీపుల్ కంపెనీలో పనిచేస్తుండేవాడిని.. ఫాంటసీ థ్రిల్లర్ నచ్చడంతో.. నిర్మాత రాహుల్ రెడ్డి కామెంట్స్

Producer: ఐటీ మల్టీపుల్ కంపెనీలో పనిచేస్తుండేవాడిని.. ఫాంటసీ థ్రిల్లర్ నచ్చడంతో.. నిర్మాత రాహుల్ రెడ్డి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Producer Rahul Reddy About Tuk Tuk Movie: తెలుగు ఫాంటసీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన సినిమా టుక్ టుక్. సి. సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాహుల్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు. టుక్ టుక్ రిలీజ్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ రాహుల్ రెడ్డి కామెంట్స్ చేశారు.

ఐటీ మల్టీపుల్ కంపెనీలో పనిచేస్తుండేవాడిని.. ఫాంటసీ థ్రిల్లర్ నచ్చడంతో.. నిర్మాత రాహుల్ రెడ్డి కామెంట్స్

Producer Rahul Reddy About Tuk Tuk Movie: ఫాంటసీ, మ్యాజికల్‌ అంశాలతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రిలీజ్ అయిన చిత్రం 'టుక్‌ టుక్‌'. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి. సుప్రీత్‌ కృష్ణ దర్శకత్వం వహించారు.

సినిమా రెస్పాన్స్

మార్చి 21న టుక్ టుక్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రెస్పాన్స్ బాగానే ఉంది. అయితే, టుక్ టుక్ రిలీజ్ డేట్‌కు ముందు ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ పాల్గొంది. ఓ ఇంటర్వ్యూలో టుక్ టుక్ మూవీ నిర్మాత రాహుల్ రెడ్డి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ నేపథ్యం?

-ఐటీ మల్టీపుల్‌ కంపెనీలో పనిచేస్తుండేవాడిని. ఆ తరువాత యానిమేషన్‌ స్టూడియో స్టార్ట్‌ చేశాను. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయమైన దర్శకుడు సుప్రీత్‌తో కలిసి మొదటగా అలనాటి చిత్రాలు వెబ్‌ సీరిస్‌ చేశాను. నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్‌ కూడా ఉండటంతో థియేటర్‌ సినిమా చేయాలని అనుకున్నాను.

-సుప్రీత్‌ చెప్పిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌ నచ్చడంతో 'టుక్‌టుక్‌ చిత్రాన్ని స్టార్ట్‌ చేశాను. కంటెంట్‌ నచ్చడంతో అందరూ కలిసి, నేను యానిమేషన్‌లో కూడా ఉండటంతో.. ఈ పాంటసీ కథతో టుక్‌ టుక్‌ కథను ప్రారంబించాం. దీనినే ఫ్రాంఛైజీగా చేద్దామనుకుంటున్నాం. కంటెట్‌తో పాటు కమర్షియల్‌ అంశాలు జోడించాం.

టుక్‌ టుక్‌పై మీకున్న నమ్మకం ఎలాంటింది?

-కంటెంట్‌ ఉంటే ప్రేక్షులు ఆదిరిస్తారు అనేది నా నమ్మకం. ఏ భాషలోనైనా కొత్తదనంగా ఉంటే ఆదరిస్తారు. కంటెంట్‌ నచ్చితేనే కమర్షియల్‌ హిట్‌లుగా నిలుస్తాయి. ప్రొడ్యూసర్‌గా నా నమ్మకం అదే.

టుక్‌ టుక్‌ టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి?

-టుక్‌ టుక్‌ అని త్రీ వీల్డ్‌ ఆటోను అంటారు. సినిమాలో టుక్‌ టుక్‌ ఆటో కీలక పాత్ర పోషించింది. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. సినిమాలో ఆర్టిస్ట్‌లను కూడా పాత్రలకు ఎవరి సెట్‌ అయితే వాళ్లనే తీసుకున్నాం.

ఇందులో కీలక పాత్ర పోషించిన రోషన్‌ నటించిన కోర్టు హిట్‌ కావడం మీ సినిమాకు ఎంత వరకు ప్లస్‌ అవుతుంది?

-కోర్ట్ సినిమా హిట్‌ అవ్వడం మా సినిమాకు మంచి శుభారంభం. ఈ సినిమాతో కూడా రోషన్‌కు కూడా మంచి పేరు వస్తుంది. తప్పకుండా కోర్టు హిట్‌ అవ్వడం చాలా ప్లస్‌ అవుతుంది. మా సినిమాకు కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ ఉంది.

టుక్‌ టుక్‌లో ప్రధాన అంశాలు ఏమిటి?

-ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, ఫాంటసీ, థ్రిల్లింగ్‌ అన్ని అంశాలు ఉంటాయి. ప్రేక్షకులను రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఎక్కడ కూడా బోర్‌ కొట్టదు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం