చక్రి గొంతుతో పెప్పీ సాంగ్.. మాస్ బీట్.. ఇడియట్ ట్యూన్.. యూట్యూబ్ లో ట్రెండింగ్.. ఇవే లిరిక్స్-tu mera lover lover song lyrics in telugu chakri voice recreated with ai ravi teja mass jathara movie sreeleela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  చక్రి గొంతుతో పెప్పీ సాంగ్.. మాస్ బీట్.. ఇడియట్ ట్యూన్.. యూట్యూబ్ లో ట్రెండింగ్.. ఇవే లిరిక్స్

చక్రి గొంతుతో పెప్పీ సాంగ్.. మాస్ బీట్.. ఇడియట్ ట్యూన్.. యూట్యూబ్ లో ట్రెండింగ్.. ఇవే లిరిక్స్

మాస్ బీట్స్ తో కొత్త పెప్పీ సాంగ్ ఒకటి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్-1 ప్లేస్ లో కొనసాగుతోంది. చనిపోయిన చక్రి గొంతుతో వచ్చిన ఈ పాట దుమ్మురేపుతోంది. రవితేజ సినిమా ‘మాస్ జాతర’ నుంచి వచ్చిన ‘తు మేరా లవర్ లవర్’ న్యూ సాంగ్ లిరిక్స్ ఇవే. మీరూ పాడేయండి.

తు మేరా లవర్ సాంగ్ లో రవితేజ, శ్రీలీల (x/RaviTeja_offl)

యూట్యూబ్ లో కొత్త సాంగ్ రచ్చరచ్చ చేస్తోంది. రవితేజ హీరోగా యాక్ట్ చేస్తున్న ‘మాస్ జాతర’ సినిమాలోని న్యూ సాంగ్ లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది. ‘తు మేరా లవర్ లవర్’ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. ప్రస్తుతం సాంగ్స్ లో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ పాట కోసం చనిపోయిన చక్రి గొంతును ఏఐ సాయంతో రీక్రియేట్ చేయడం విశేషం. ఏప్రిల్ 14న రిలీజైన ఈ సాంగ్ కు ఇప్పటివరకూ (ఏప్రిల్ 18 ఉదయం) 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

మాస్ బీట్

రవితేజ లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ నుంచి రిలీజైన లిరికల్ సాంగ్ ‘తు మేరా లవర్ లవర్’ మాస్ బీట్ తో సాగుతోంది. ఈ పెప్పీ సాంగ్ లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. అంతేకాకుండా రవితేజ ఫేమస్ మూవీ ఇడియట్ నుంచి ఎంతో వైరల్ అయిన ‘చూపుల్తో గుచ్చి గుచ్చి సాంగ్’ ట్యూన్ ను ఈ సాంగ్ లో వాడారు. ఇక ఆ పాటలోని ఐకానిక్ స్టెప్స్ తో రవితేజ మరోసారి ఈ కొత్త సాంగ్ లో సందడి చేశారు.

చక్రికి అంకితంగా తీసుకొచ్చిన ఈ సాంగ్ ను భాస్కరభట్ల రవి కుమార్ రాశారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. రవితేజ-శ్రీలీల జోడీ ఈ సాంగ్ లో హుషారుగా డ్యాన్స్ స్టెప్పులు వేసినట్లు కనిపిస్తోంది.

ఇదిగో లిరిక్స్

పల్లవి:

తు మేరా లవ్వరు లవ్వరు లవర్

మే తుజ్కో దియా ఫ్లవ్వరు

తు మేరా లవ్వరు లవ్వరు లవర్

పెట్టావే చెవిలో కాలీఫ్లవ్వరు

నీలాగా నచ్చలేదు గిచ్చలేదు ఎవ్వరు

చొక్కలే చింపుకోరే నాకు లాగా అందరు

నువ్వేమో తులసి కోటలోనా గాంజ ఫ్లేవరు

మీ బాబు నిన్ను మించి ఇంకా పెద్ద లోఫర్..ర్

పైకేమో స్కాచ్ బాటిల్ లాగ నువ్వు సూపర్

నీ మైండ్ చూడబోతే చీపు లిక్కర్

నా గొంతు కోస్తివే దొంగ టీచర్

హే.. తు మేరా లవ్వరు లవ్వరు లవర్

మే తుజ్కో దియా ఫ్లవ్వర్

తు మేరా లవ్వరు లవ్వరు లవర్

పెట్టావే చెవిలో కాలీఫ్లవ్వరు

చరణం 1:

ఒసోసి జింకా పరుగెత్తకింకా

నీ తీగ లాగి పట్టేసా డొంక

నీలాంటి పిల్లా.. ఉంటే ప్రతి జిల్లా

కొల్లేరైపోదా తెల్లారేకల్లా

నిన్నేన్ని బండబూతులు తిట్టుకున్నా తప్పు లేదు

నా ఉసురే నీకు తగిలి జిందగీ లో పెళ్లి కాదే

నీ కోసం పడిచస్తుంటే

నా కంట్లోనే కారాన్ని కొట్టావ్ కాదే

తు మేరా లవ్వరు

తు మేరా లవ్వరు

తు మేరా లవ్వరు లవ్వరు లవర్

మే తుజ్కో దియా ఫ్లవ్వర్

చరణం 2:

నీ అందం చూసి నే పడిపోలేదే

ఏదో ఊహించి లవ్ చెయ్యలేదే

అబ్బాయిలంతా చెడ్డోళ్లేం కాదే

అమ్మాయిలంతా మంచోళ్లు కాదే

నువ్వట్టా కళ్లలోకి కళ్లు పెట్టి సూడామాకే

నీ మీద కోపమంత తగ్గితే నవ్వమాకే

నట్టింట్లో కాలు పెట్టి

రమ్మంటుంటే నట్టేట్లో తోసావ్ కదే

తు మేరా లవ్వరు లవ్వరు లవర్

మే తుజ్కో దియా ఫ్లవ్వర్

తు మేరా లవ్వరు లవ్వరు లవర్

పెట్టావే చెవిలో కాలీఫ్లవ్వరు

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం