మళ్లీ కాపీ కొట్టి నెటిజన్లకు దొరికిపోయిన ఊర్వశి రౌతేలా-ప్రియాంక చోప్రా స్టోరీలను పేస్ట్ చేసేసిన బోల్డ్ బ్యూటీ-ట్రోల్స్-trolls on bollywood bold beauty urvashi rautela for copy priyanka chopra stories on dussehra is she acting dumb ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మళ్లీ కాపీ కొట్టి నెటిజన్లకు దొరికిపోయిన ఊర్వశి రౌతేలా-ప్రియాంక చోప్రా స్టోరీలను పేస్ట్ చేసేసిన బోల్డ్ బ్యూటీ-ట్రోల్స్

మళ్లీ కాపీ కొట్టి నెటిజన్లకు దొరికిపోయిన ఊర్వశి రౌతేలా-ప్రియాంక చోప్రా స్టోరీలను పేస్ట్ చేసేసిన బోల్డ్ బ్యూటీ-ట్రోల్స్

ప్రియాంక చోప్రా ప్రఖ్యాత ప్రైమాటాలజిస్ట్ జేన్ గుడాల్, దసరా, గాంధీ జయంతి గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అవే పోస్టులను కాపీ చేసిన ఊర్వశి రౌతేలాపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.

ఊర్వశి రౌతేలా, ప్రియాంక చోప్రా

బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను కాపీ కొట్టిందనే ట్రోల్స్ వస్తున్నాయి. గురువారం (అక్టోబర్ 2) ప్రియాంక తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేసిన అదే నాలుగు ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను ఊర్వశి మళ్లీ షేర్ చేసింది. ప్రియాంక చోప్రా పోస్టులను కాపీ చేసిందని ఊర్వశిపై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

ప్రియాంక స్టోరీలు

ప్రియాంక చోప్రా ప్రఖ్యాత ప్రైమాటాలజిస్ట్ జేన్ గుడాల్, దసరా, గాంధీ జయంతి గురించి స్టోరీలు పెట్టింది. ఊర్వశి రౌతేలా అదే విషయాలను ఎంచుకోవడమే కాకుండా, అవే పోస్టులను మళ్లీ షేర్ చేసింది. రెడ్డిట్, సోషల్ మీడియా యూజర్లు ప్రియాంక, ఉర్వశి స్టోరీల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు.

దీనిపై స్పందిస్తూ ఓ యూజర్ "పిన్న వయస్సులోనే అత్యంత అందమైన ఐఐటీయన్ అందాల పోటీ విజేత ఏమో ప్రియాంక చోప్రా లాగానే స్టోరీలు పోస్ట్ చేసింది. ఆమె నిజమైన వ్యక్తి అని నేను చెప్పలేను" అని రాసుకొచ్చాడు. ఒక రెడ్డిట్ యూజర్ "ఊర్వశి ఎప్పుడూ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి తెలివితక్కువగా నటిస్తుందా అని నేను ఆశ్చర్యపోతుంటా. ఎవరూ పట్టించుకోని రాణి ఆమె. ఇది చాలా ఫన్నీగా ఉంది!" అని అన్నాడు

చెడ్డగా ఉన్నా

"ఉర్వశి కొద్ది మోతాదులో సరదాగా ఉంటుంది. నా క్రష్ నుండి ఫోకస్ పొందాలనుకున్నప్పుడు నేను కూడా ఇలాగే చేసేవాణ్ని. అదంతా స్కూల్ డేస్ లో" అని ఒకరు, "ఉర్వశి చాలా వినోదాత్మక బాలీవుడ్ సెలబ్రిటీలలో ఒకరు. ఆమె ఒక ఫన్ బ్రెయిన్-రాట్ సినిమా లాంటిది. ఇది చూడటానికి చాలా చెడ్డగా ఉంటుందని మీకు తెలుసు, కానీ చూడటానికి సరదాగా ఉంటుంది!!" అని మరొకరు కామెంట్ చేశారు.

క్వీన్ ఊర్వశి

ఒక సోషల్ మీడియా యూజర్, "ఆమె తెలివితక్కువది కాదు....ఆమె ఇలా చేసిన తర్వాతే మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం, కాబట్టి ఆమె గెలిచింది. మరోసారి క్వీన్ ఊర్వశి గెలిచింది" అని అన్నాడు. మరొక కామెంట్లో "రాఖీ సావంత్ తర్వాత ఈమె మాత్రమే ఎప్పుడూ వినోదం పంచగలదు" అని ఉంది. "ఉర్వశి ఎలాగోలా వార్తల్లో నిలవగలదు... ఆమెకు హ్యాట్సాఫ్" అని మరొక వ్యక్తి ట్రోల్ చేశాడు.

అప్పుడు కాపీనే

ఉర్వశి గతంలో కూడా ఇలా చేసింది. 2020లో ఊర్వశి న్యూయార్క్ రచయిత జేపీ బ్రామర్ యొక్క పారసైట్అభిప్రాయాలను ఎక్స్ లో కాపీ-పేస్ట్ చేసింది. ఆమె గతంలో పీఎం నరేంద్ర మోడీ, మోడల్ గిగి హడిడ్ చేసిన ట్వీట్‌లను కూడా క్రెడిట్ ఇవ్వకుండా షేర్ చేసింది. 2022లో ఉర్వశి తన టెడ్ ఎక్స్ టాక్ స్పీచ్ కోసం మునుపటి స్పీకర్ల నుండి అన్ని ప్రధాన అంశాలను దొంగిలించినట్లు కనిపించింది.

ఉర్వశి చివరిగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన తెలుగు పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం డాకు మహారాజ్‌లో కనిపించింది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, సచిన్ ఖేడేకర్, మకరంద్ దేశ్‌పాండే, రవి కిషన్ తదితరులు కూడా నటించారు. ప్రియాంక ఏమో ఎస్ఎస్ రాజమౌళి రాబోయే చిత్రంలో మహేష్ బాబుతో కలిసి నటిస్తోంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం