Pooja Hegde : పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా!-trivikram srinivas producing new movie with pooja hegde ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Trivikram Srinivas Producing New Movie With Pooja Hegde

Pooja Hegde : పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా!

Anand Sai HT Telugu
Jul 11, 2023 10:02 AM IST

Pooja Hegde-Trivikram Srinivas : మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ ఆమె తప్పుకుంది. అయితే పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చాడు గురూజీ.

పూజా హెగ్డే, త్రివిక్రమ్
పూజా హెగ్డే, త్రివిక్రమ్

హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ తొలిసారి చేసిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా మంచి హిట్ అయింది. తర్వాత అల వైకుంఠపురములో సినిమాతో వీరిద్దరూ మళ్లీ కలిసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. గుంటూరు కారం(Gunturu Karam) సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉంటే.. ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుంది.

ట్రెండింగ్ వార్తలు

పూజా హెగ్డేకు మరో అవకాశం

అయితే పూజా హెగ్డే(Pooja Hegde) తన సినిమాలో నుంచి తప్పుకొన్నా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలో కాకుండా ఆయన నిర్మించే కొత్త సినిమాలో పూజా కథానాయికగా నటిస్తుందని అంటున్నారు. ఈ మేరకు టాలీవుడ్(Tollywood)లో టాక్ నడుస్తోంది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా!

సంపత్ నంది దర్శకత్వం వహించే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) హీరోగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేకి ఆఫర్ వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పూజా హెగ్డేకు సరైన హిట్ లేదు. ఇటీవల విడుదలైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కూడా పరాజయం పాలైంది. మంచి హిట్ కోసం పూజా హెగ్డే చూస్తుంది.

గుంటూరు కారం నుంచి ఔట్

మహేష్ బాబు(Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే నటించాల్సి ఉండేది. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి, పలు కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా స్క్రిప్ట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని మార్పులు చేయగా పూజా హెగ్డేకు డేట్స్ సెట్ కాలేదు. దీంతో ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఇలా హీరోయిన్లు సినిమా నుంచి బయటికి వెళితే దర్శకులకు కోపం వస్తుంది. మళ్లీ ఆ హీరోయిన్‌తో సినిమా చేయరు చాలా మంది. కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా కాదు. పూజా హెగ్డేకి మునుపటిలా గౌరవం ఇచ్చి, మరో ఆఫర్‌ కూడా ఇచ్చాడు.

జూన్ నుండి డిసెంబర్ వరకు ఇతర చిత్రాలకు పూజా డేట్స్ ఇచ్చిందని చెబుతున్నారు. గుంటూరు కారం సినిమా చేస్తే.. ఇతర సినిమాలు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందని, అందుకే బయటకు వచ్చినట్టుగా అంటున్నారు. పూజా హెగ్డేతోపాటుగా.. సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ సినిమా నుంచి బయటకు వచ్చాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.