Raangi OTT Release Date: త్రిష రాంగీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే - స్ట్రీమింగ్ ఏ ప్లాట్‌ఫామ్‌లోనంటే
Raangi OTT Release Date: త్రిష హీరోయిన్‌గా నటించిన రాంగీ సినిమా ఈ నెలలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...
Raangi OTT Release Date: త్రిష రాంగీ సినిమా ఈ నెలాఖరున ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 30న థియేటర్లలో విడుదలైంది. రాంగీ సినిమాకు ఎమ్.శరవణన్ దర్శకత్వం వహించాడు. 2020లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా అనివార్య కారణాల వల్ల రెండేళ్లు ఆలస్యంగా థియేటర్లలోకి ఈ సినిమా వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నెల 28 లేదా 30లలో ఓటీటీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇందులో న్యూస్ ఛానల్ రిపోర్టర్ పాత్రలో త్రిష కనిపించింది.
టెర్రరిస్ట్‌లతో సంబంధాలున్నాయని తనపై పడిన ముద్రను తొలగించుకోవడానికి పోరాటం చేసే యువతిగా యాక్షన్ ప్రధాన రోల్‌లో త్రిష ఈ సినిమాలో నటించింది. త్రిష నటనకు మంచి పేరువచ్చినా కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది.
అందువల్లే థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు లాంగ్ గ్యాప్ తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాతో కమర్షియల్ హిట్‌ను అందుకున్నది త్రిష.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చోళ సామ్రాజ్య యువరాణి కుందవి పాత్రలో నటించింది. ఈ సక్సెస్‌తో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్న త్రిష ప్రస్తుతం కమల్‌హాసన్ 234తో పాటు విజయ్ -లోకేష్ కనకరాజ్ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పొన్నియన్ సెల్వన్ సీక్వెల్‌లో త్రిష నటిస్తోంది. ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది.