Raangi Streaming On OTT: త్రిష రాంగి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఆదివారం (నేడు)సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజైంది. తమిళం, తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో రాంగి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు జర్నీ ఫేమ్ ఎమ్ శరవణన్ దర్శకత్వం వహించాడు.,ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ కథను అందించారు. డిసెంబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ రావడంతో తక్కువ టైమ్‌లోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.,రాంగి సినిమాలో ఆన్‌లైన్ ఛానల్ రిపోర్టర్ పాత్రలో త్రిష నటించింది. టెర్రరిస్ట్‌గా తనపై పడిన అపవాదును తొలగించుకునేందుకు ఓ యువతి సాగించిన పోరాటం నేపథ్యంలో దర్శకుడు శరవణన్ ఈ సినిమాను తెరకెక్కించారు. రాంగి సినిమాలో త్రిష యాక్టింగ్‌కు పేరొచ్చిన కథ, కథనాలపై మాత్రం విమర్శలొచ్చాయి.,2020లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కరోనా కారణంగా రిలీజ్ ఆలస్యమైంది. రాంగి సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. గత ఏడాది విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నది త్రిష. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చోళ యువరాణి కుందైవిగా నటించింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది.,ఈ సీక్వెల్‌తో పాటు విజయ్- లోకేష్ కనకరాజ్ సినిమాలతో త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కమల్‌హాసన్, మణిరత్నం సినిమాలో కథానాయికగా త్రిష పేరు వినిపిస్తోంది.