Trisha Instagram post: నా కొడుకు చనిపోయాడంటూ క్రిస్మస్ రోజు త్రిష విషాదమైన పోస్ట్.. సానుభూతి తెలుపుతున్న అభిమానులు-trisha krishnan dog zorro dead her post on christmas made fans emotional ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trisha Instagram Post: నా కొడుకు చనిపోయాడంటూ క్రిస్మస్ రోజు త్రిష విషాదమైన పోస్ట్.. సానుభూతి తెలుపుతున్న అభిమానులు

Trisha Instagram post: నా కొడుకు చనిపోయాడంటూ క్రిస్మస్ రోజు త్రిష విషాదమైన పోస్ట్.. సానుభూతి తెలుపుతున్న అభిమానులు

Hari Prasad S HT Telugu
Dec 25, 2024 04:42 PM IST

Trisha Dog: నా కొడుకు చనిపోయాడంటూ క్రిస్మస్ రోజు త్రిష చేసిన పోస్ట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్టుపై అభిమానులు సానుభూతి తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

నా కొడుకు చనిపోయాడంటూ క్రిస్మస్ రోజు త్రిష విషాదమైన పోస్ట్.. సానుభూతి తెలుపుతున్న అభిమానులు
నా కొడుకు చనిపోయాడంటూ క్రిస్మస్ రోజు త్రిష విషాదమైన పోస్ట్.. సానుభూతి తెలుపుతున్న అభిమానులు

Trisha Dog: త్రిష కృష్ణన్ క్రిస్మస్ రోజే ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన కొడుకు జోరో చనిపోయినట్లు చెబుతూ ఆమె చేసిన పోస్టు చూసి ఫ్యాన్స్ సానుభూతి తెలుపుతున్నారు. క్రిస్మస్ రోజే తన ఇంట్లో ఈ విషాదం జరిగినట్లు ఆమె చెప్పింది. ఇక్కడ తన కొడుకు అంటే జోరో అనే ఆమె పెంపుడు కుక్క కావడం విశేషం. బుధవారం (డిసెంబర్ 25) ఉదయమే ఈ విషాదం జరిగిందంటూ ఆమె తన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్ట్ చేసింది.

yearly horoscope entry point

త్రిష 'కొడుకు' జోరో కన్నుమూత

తెలుగు, తమిళ నటి త్రిష కృష్ణన్ క్రిస్మస్ రోజు తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. తన కొడుకు జోరో చనిపోయాడని ఆమె చెప్పింది. తన పెంపుడు కుక్క జోరోనే ఆమె తన కొడుకుగా చెప్పడం విశేషం. 2012 నుంచి ఈ కుక్క ఆమెతోనే ఉంది. ఇప్పుడు క్రిస్మస్ రోజే అది మృతి చెందడంతో త్రిష చాలా బాధపడుతోంది. జోరో 2012-24 అనే క్యాప్షన్ తో ఆమె ఈ పోస్టు చేసింది.

ఇందులో జోరో ఫొటోలను కూడా షేర్ చేసింది. చివర్లో జోరో సమాధికి సంబంధించిన ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది. అది చూసి ఫ్యాన్స్ ఆమెకు సానుభూతి తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా కష్ట సమయమని, ధైర్యంగా ఉండాలంటూ ఆమెకు సూచిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లోనూ త్రిష జోరో గురించి మరో పోస్టు చేసింది. "నా కొడుకు జోరో కన్నుమూశాడు. క్రిస్మస్ రోజు ఉదయమే ఈ విషాదం జరిగింది. ఇక నా జీవితం శూన్యమని నా గురించి తెలిసిన వాళ్లకు బాగా తెలుసు. నేను, నా కుటుంబం షాక్ లో ఉన్నాం. కొన్ని రోజుల పాటు షూటింగులకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాను" అని త్రిష చెప్పింది.

అయితే త్రిష చెబుతున్నది తన కుక్క గురించి అని తెలియని కొంతమంది అభిమానులు.. అసలు ఆమెకు కొడుకు ఏంటి? పెళ్లెప్పుడైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె తన కుక్క గురించి మాట్లాడుతోందంటూ మరికొందరు సమాధానమిస్తున్నారు.

త్రిష రాబోయే సినిమాలు

త్రిష ఈ మధ్యే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇది కాకుండా 2024లో బృందా అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వంభర మూవీలో నటించబోతోంది. ఇది కాకుండా మలయాళంలో రామ్, తమిళంలో విదాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, సూర్య 45లాంటి మూవీస్ లో నటించబోతోంది.

Whats_app_banner