మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చాలా ఏళ్లకు వీరి జోడీ రిపీట్ అవుతోంది. నేడు (మే 4) త్రిష పుట్టిన రోజు కావడంతో ఓ సర్‌ప్రైజ్ తీసుకొచ్చింది మూవీ టీమ్.
విశ్వంభర చిత్రం నుంచి త్రిష ఫస్ట్ లుక్‍ను టీమ్ రివీల్ చేసింది. ఆమె బర్త్‌డే సందర్భంగా పోస్టర్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో అవని పాత్రలో త్రిష కనిపించనున్నారని వెల్లడించింది. విషెస్ చెప్పింది.
అద్భుతంగా ఉండే అవని పాత్రను త్వరలో చూస్తారంటూ విశ్వంభరను ప్రొడ్యూజ్ చేస్తున్న యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్రిషకు విశ్వంభర టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. తేజస్సు, అద్బుతమైన నటనతో ఆమె అవని పాత్రకు జీవం తీసుకొచ్చారు. త్వరలో మెగా మాస్ బియాండ్ యూనివర్స్ థియేటర్లలోకి రానుంది” అని యూవీ క్రియేషన్స్ రాసుకొచ్చింది.
విశ్వంభర సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడింది. ఇప్పటి వరకు రిలీజ్‍పై క్లారిటీ రాలేదు. ఆలస్యమవుతూనే ఉంది. వీఎఫ్‍ఎక్స్ పనులు లేట్ అవుతుండడం, ఓటీటీ డీల్ విషయంలోనూ చర్చలు సాగుతుండడం వల్ల రిలీజ్ డేట్‍ను ఇంకా ఖరారు చేయలేకపోతోంది మూవీ టీమ్. జూలైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు అంచనాలు ఉన్నాయి. త్రిష పుట్టిన రోజు సందర్భంగా తీసుకొచ్చిన ఈ పోస్టర్‌లోనూ మూవీ టీమ్ రిలీజ్ గురించి ప్రస్తావించలేదు. దీంతో ఇంకా ఏ విడుదల తేదీపై క్లారిటీ రాలేదు.
విశ్వంభర సినిమాకు రూ.150కోట్లకుపైగానే బడ్జెట్ అవుతోందని సమాచారం. వీఎఫ్ఎక్స్‌కే సుమారు సుమారు రూ.75కోట్ల ఖర్చు అవుతోందట. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ, విక్రమ్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. బింబిసారతో భారీ హిట్ దక్కించుకున్న వశిష్ట దర్శకత్వవం వహిస్తుడడం కూడా ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. ముల్లోకాల మధ్య సాగే కథతో ఈ చిత్రం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
విశ్వంభరలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత సుమారు 18 ఏళ్ల అనంతరం వీరు మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో అషికా రంగనాథ్, రమ్య కునాల్ కపూర్ కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన డెవోషనల్ సాంగ్ మంచి రెస్పాన్ తెచ్చుకుంది.
త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభరతో పాటు తమిళంలో థగ్‍లైఫ్ మూవీలో నటిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న థగ్‍లైఫ్‍లో కమల్ హాసన్, శింబు లీడ్ రోల్స్ చేస్తున్నారు. సూర్య - డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబినేషన్‍లో చిత్రానికి కూడా త్రిష ఓకే చెప్పారట. మలయాళంలో మోహన్‍లాల్‍తో రామ్ మూవీ కూడా ఈ బ్యూటీ లైనప్‍లో ఉంది.
సంబంధిత కథనం