సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కే స్పిరిట్ మూవీ షూటింగ్ కు ముందే వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. మూవీ నుంచి హీరోయిన్ గా దీపికా పదుకొణెను తప్పించడం సంచలనంగా మారింది. ఆమె ప్లేస్ లో త్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే ఇప్పుడు దీపికాకు సంబంధించిన వీడియోను త్రిప్తి లైక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల దీపికాను సమర్థిస్తూ వచ్చిన ఓ సోషల్ మీడియా రీల్ వైరల్ గా మారింది. దీపికా పదుకొణె వృత్తి నైపుణ్యాన్ని త్రిప్తి మెచ్చుకున్నారు. సెలబ్రిటీ చీర స్టైలిస్ట్ డాలీ జైన్ షేర్ చేసిన రీల్ లో దీపికా వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించింది. ఆమె 30 కిలోల లెహంగా ధరించి నాగడా సంగ్ ధోల్ లో గాయాలపాలైనా ఎలా బేర్‌ఫూట్‌తో డ్యాన్స్ చేసిందో గుర్తు చేసుకుంది. ప్రతికూల పీఆర్, ద్వేషపూరిత ప్రచారాలు ప్రజల అభిప్రాయాన్ని ఎలా వక్రీకరిస్తాయో కూడా వీడియోలొ ప్రస్తావించింది.
దీపికా ప్రొఫెషనలిజాన్ని పొగుడుతూ వచ్చిన రీల్ పై త్రిప్తి లైక్ చేయడం వైరల్ గా మారింది. ఒక అభిమాని ఇలా వ్రాశాడు, "హైలైట్ చేసిన భాగం చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నా.. 'ద్వేషపూరిత ప్రచారాలు ఆమెను చూసే విధానాన్ని నిర్ణయించడానికి అనుమతించకుండా ఆపడానికి ఇది సమయం' అని పేర్కొన్నాడు. ‘‘త్రిప్తి స్వయంగా దీనిని అనుభవించిందని నేను అనుకుంటున్నా. ప్రజలు, ప్రత్యర్థి పీఆర్ లు కనికరం లేకుండా, నిరంతరం ఆమెను ద్వేషిస్తున్నారు. ఇది చాలా ఎక్కువ’’ అని అభిమాని కామెంట్ చేశాడు.
త్రిప్తి కూడా ఇటీవలి సంవత్సరాలలో అనేక విమర్శలను ఎదుర్కొంది. ఆన్‌లైన్ ట్రోల్స్ బారిన పడింది. అంతే కాకుండా ఆషికి 3 నుండి ఆమెన తప్పించారనే పుకార్లు వినిపించాయి. ఒక రెడ్డిట్ యూజర్.. "త్రిప్తికి వ్యతిరేకంగా అనేక ప్రచారాలు జరిగాయి. ఆమెను ఆషికి నుండి తొలగించారని, ఆమె గురించి అసభ్యకరమైన విషయాలు చెప్పారని గుర్తుందా? ఇది అసహ్యంగా ఉంది. బాలీవుడ్‌ను తీవ్రంగా ప్రశ్నించేలా చేస్తుంది." అని రాసుకొచ్చాడు.
"పురుషులు 100 విషయాలు అడగవచ్చు, కానీ ఎవరూ పట్టించుకోరు. ఒక మహిళ ఏదైనా చెప్తే మాత్రం అది సమస్య అవుతుంది’’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు. దీపికా, త్రిప్తి ఇలా క్లోజ్ గా ఉండటం సంతోషంగా ఉందన్నారు. దీపికా ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కింగ్ కోసం షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ కూడా నటిస్తున్నారు. త్రిప్తి చివరిగా సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ధడక్ 2లో కనిపించింది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం