Tripti Dimri Unseen Pic: బాయ్‌ఫ్రెండ్‌తో యానిమల్ బ్యూటి ఊహించని ఫొటో.. తృప్తి దిమ్రి డేటింగ్ వార్తలకు పెరిగిన జోరు!
Tripti Dimri With Boyfriend Sam Merchant On His Birthday: యానిమల్ బ్యూటి, బాలీవుడ్ ముద్దుగుమ్మ తృప్తి దిమ్రి అన్‌సీన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ సామ్ మర్చంట్‌తో అతని బర్త్ డే సందర్భంగా తృప్తి దిమ్రి షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Tripti Dimri Unseen Pic With Boyfriend Sam Merchant: బాలీవుడ్ గ్లామర్ బ్యూటి త్రిప్తి దిమ్రి తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ అయిన సామ్ మర్చంట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో సామ్ మర్చంట్‌తో తృప్తి దిమ్రి డేటింగ్ వార్తలు మళ్లీ జోరందుకున్నాయి.

తృప్తి దిమ్రి అన్‌సీన్ ఫొటో
యానిమల్ మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తృప్తి దిమ్రి బాయ్‌ఫ్రెండ్ సామ్ మర్చంట్‌తో సన్నిహితంగా ఉన్న ఎప్పుడు చూడని అన్‌సీన్ ఫొటోను సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోను ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ బ్యూటిఫుల్ కొటేషన్ రాసుకొచ్చింది తృప్తి దిమ్రి. ఈ ఫొటోలో సామ్, తృప్తి క్లోజ్‌గా కలిసి ఉన్నారు.
నవ్వుతూ సెల్ఫీ
గురువారం (జనవరి 30) షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోని ఫొటోలో తృప్తి దిమ్రి, సామ్ మర్చంట్ ఇద్దరూ సన్ గ్లాసెస్ పెట్టుకుని, నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నారు. అలాగే, ఈ స్టోరీలో సామ్‌కు సంబంధించిన మరికొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. అందులో ఒకటి అతను కారు నడుపుతున్న ఫొటో కాగా, మరొకటి అతను ప్రదర్శనలో ఉన్న వెండి ఆభరణాల వైపు చూపుతున్న ఫోటో. అలాగే బర్త్ డే ట్రీట్‌లోని తృప్తి దిమ్రి తన పిక్స్ కూడా షేర్ చేసింది.
మళ్లీ నీకే తిరిగి వస్తుంది
ఆ ఫోటోల కలేక్షన్‌ను పంచుకుంటూ అందమైన కోట్ రాసుకొచ్చింది తృప్తి దిమ్రి. "హ్యాపీ బర్త్ డే సామ్ మెర్చెంట్ (హార్ట్ ఇమోజి) మీరు పంచే ఇంత ప్రేమ, ఆనందం మళ్లీ నీకే వస్తుంది" అని రాసుకొచ్చింది తృప్తి దిమ్రి. ఇదిలా ఉంటే, త్రిప్తి-సామ్ డేటింగ్ చేస్తున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, వారిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
తరచుగా ఇలాంటి పిక్స్‌తో
వారు తరచుగా ఇలాంటి ఫొటోలను పంచుకుంటూ, వారు కలిసి ఎలా గడుపుతున్నారో సూచిస్తున్నారు. ఈ జంట కలిసి ఫిన్లాండ్‌లో కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఇలాంటి పిక్స్, వీడియోలను పోస్ట్ చేసి డేటింగ్ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోస్తున్నారు. అలాగే, వారు ఎంత సంతోషంగా గడుపుతున్నారో సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు.
అసలు ఎవరీ సామ్ మర్చెంట్?
ఇక సామ్ మెర్చంట్ విషయానికొస్తే.. అతనొక హోటలియర్, హై-ఎండ్ వీఐపీ అకామడేషన్ ఇచ్చే కాసా వాటర్స్, అవోర్ గోవా ఫౌండర్. హాస్పిటాలిటీ ఇంస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందు సామ్ మర్చంట్ మోడల్‌గా బాగా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత కాలక్రమేణా అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్లతో తన వ్యాపారాలను విస్తరించాడు.
ఫాలోవర్స్
అలాగే, తన వ్యాపార కార్యకలాపాలతో పాటు, అతను ట్రావెల్ బ్లాగింగ్‌ను ఇష్టపడుతాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో సామ్ మర్చంట్‌కు 250K కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.
తృప్తి దిమ్రి నెక్ట్స్ మూవీస్
ఇక ఇటీవల తృప్తి దిమ్రి భూల్ భులయ్యా 3 సినిమాతో మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతంత షాహిద్ కపూర్ సినిమా చేయనుంది. దాంతోపాటు సాజిడ్ నడియడ్‌వాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. జనవరి 6న ప్రారంభమైన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం