Bigg Boss Telugu 6 Episode 86: 13వ వారం నామినేషన్‌లోకి ఆరుగురు.. రేవంత్‌పై ఆదిరెడ్డి, ఫైమా ఫైర్-total 6 members nominated in bigg boss telugu 6 13th week nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 6 Episode 86: 13వ వారం నామినేషన్‌లోకి ఆరుగురు.. రేవంత్‌పై ఆదిరెడ్డి, ఫైమా ఫైర్

Bigg Boss Telugu 6 Episode 86: 13వ వారం నామినేషన్‌లోకి ఆరుగురు.. రేవంత్‌పై ఆదిరెడ్డి, ఫైమా ఫైర్

Maragani Govardhan HT Telugu
Nov 29, 2022 06:13 AM IST

Bigg Boss Telugu 6 Episode 86: బిగ్‌బాస్ 13వ వారం నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈ సారి మొత్తం 8 మంది ఇంటి సభ్యుల్లో ఆరుగురు నామినేట్ అయ్యారు. కెప్టెన్ ఇనాయా, శ్రీహాన్ మినహా మిగిలినవారంతా నామినేషన్‌లోకి వచ్చారు.

బిగ్‌బాస్ 13వ వారం నామినేషన్ ప్రక్రియ
బిగ్‌బాస్ 13వ వారం నామినేషన్ ప్రక్రియ

Bigg Boss Telugu 6 Episode 86: బిగ్‌బాస్ షోలో వారంలో ఆరు రోజులు ఒక ఎత్తయితే.. సోమవారం వచ్చే నామినేషన్లు ఎపిసోడ్ మరో ఎత్తు. ఏ సీజన్‌లోనైనా ఈ ఎపిసోడ్ కోసం ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. హౌస్ మెట్స్ మధ్య మాటల యుద్ధం, నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అంటూ వాదులాట, ఉప్పొంగివచ్చే ఆగ్రాహవేశాలతో మంచి వినోదాన్ని ఇస్తాయి. ఇక తాజా ఎపిసోడ్ దగ్గరకు వస్తే ఈ వారం ఇనాయా కెప్టెన్ కావడంతో ఆమె నామినేషన్ల నుంచి తప్పించుకుంది. మరోపక్క రాజ్ వెళ్లిపోవడంతో తన వల్లే వెళ్లిపోయాడని ఫైమా ఫీలయింది. నామినేషన్ ప్రక్రియలో రేవంత్-ఆదిరెడ్డి, రేవంత్-ఫైమా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

ముందుగా ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్ వెళ్లిపోయినందుకు ఫైమా ఫీలవుతూ ఉంటుంది. తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్లే ఒట్లు వచ్చినా అతడు వెళ్లిపోయాడంటూ ఏడ్చేసింది. మరోపక్క శ్రీహాన్-రేవంత్ మధ్య ఎప్పటిలానే చిన్నపాటి వాదన జరిగింది. నేను శ్రీసత్యతో కలిసి ఉన్నందుకే ఏవేవో అనేస్తున్నావ్, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావని రేవంత్‌పై సీరియస్ అవుతాడు. ఏదైనా అనే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ ఫైర్ అయ్యాడు. దీంతో హర్టయిన రేవంత్ దూరంగా వెళ్లికూర్చున్నాడు. కానీ ఎప్పటిలాగే కాసేపటి తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ గొడవలన్నీ ఎందుకు? మునుపటిలానే మాట్లాడుకుందామంటూ కలిసిపోయారు.

అనంతరం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పదోమూడో వారానికి సంబంధించి ఏ ఇద్దరినైతే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారో వారిని కెనాన్ దగ్గరకు తీసుకెళ్లి వారి ముఖాన్ని స్టాండ్‌పై పెట్టాలని, అప్పుడు వారిపై రంగు పడుతుందని దీంతో వారు నామినేట్ అవుతారని బిగ్‌బాస్ హౌస్ మేట్స్‌ను ఆదేశిస్తారు. నామినేషన్‌కు తగిన కారణాలు చెప్పాలని సూచించారు.

ఈ నామినేషన్ ప్రక్రియలో ముందుగా ఆదిరెడ్డి.. రేవంత్-రోహిత్, ఫైమా.. రేవంత్-రోహిత్, శ్రీహాన్..రోహిత్-ఆదిరెడ్డి, కీర్తి.. రేవంత్-శ్రీసత్య,, శ్రీసత్య.. కీర్తి-ఆదిరెడ్డి, రోహిత్.. ఆదిరెడ్డి-ఫైమా, రేవంత్..ఆదిరెడ్డి-ఫైమా, ఇనాయ.. రేవంత్-శ్రీసత్యను నామినేట్ చేస్తారు. ఈ నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ మంది ఆదిరెడ్డిని నామినేట్ చేస్తారు. అయితే రేవంత్-ఫైమా, రేవంత్ ఆదిరెడ్డి మధ్య హీటెడ్ ఆర్గ్యూమెంట్లు జరుగుతాయి.

ఆదిరెడ్డి-రేవంత్ సంభాషణలో గత వారం నామినేషన్ రీజన్, నాగార్జున చూపించిన వీడియోపై వాదన జరిగింది. నాగార్జున గారు చూపించిన వీడియోలో ముందు జరిగిన డిస్కషన్‌లో అది చూపించలేదు. నువ్వు గేమ్‌లో అమ్మాయి వస్తే మనకే లాభం అన్నట్లుగా మాట్లాడావు. అప్పుడు, ఇప్పుడు, ఇంకో పదేళ్ల తర్వాత కూడా నేను ఈ మాటపైనే స్టాండ్ అయి ఉంటానని బల్లగుద్ది చెప్పాడు. మరోపక్క రేవంత్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. నాగ్ సార్ అల్రెడీ నీదే తప్పని చెప్పాడు, ఇంకా దీనికోసం చర్చించడం అనవసరం స్పష్టం చేశాడు. అయితే వీరి మధ్య గొడవ మాత్రం మంచి రసవత్తరంగానే జరిగిందని చెప్పాలి.

మరోపక్క రేవంత్-ఫైమా మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. వేరే వారు సపోర్ట్ లేనిదో నువ్వు గేమ్ ఆడలేవ్.. నువ్వు నాకు చెబుతున్నావ్ అని ఫైమాను ఉద్దేశిస్తూ రేవంత్ అంటాడు. ఇందుకు ఫైమా ఆగ్రహంతో ఊగిపోతుంది. అతడిపైకి దూసుకెళ్తూ రెచ్చగొట్టేలా మాట్లాడింది. నేను సపోర్ట్ లేకుండా ఆడలేనన్నావు. నువ్వు సపోర్ట్ లేకుండా ఆడావా? అంటూ అతడిపైకి వచ్చింది. రేవంత్ వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతుండగా.. నాకు వేలు చూపించకు.. హే వేలు చూపించకు అంటూ రేవంత్ ఫైర్ అయ్యాడు. ఫైమా మాత్రం అస్సలు తగ్గలేదు. సపోర్ట్‌తో ఆడిన రేవంత్.. సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. మాటలు మారుస్తూ ఉంటాడు. ఇక్కడొక మాట, అక్కడొక మాట అంటాడు. కీర్తి నువ్వు సూపర్ ఆడావ్ అంటాడు.. మళ్లీ అక్కడికి వెళ్లి కీర్తి ఆడనే ఆడదని అంటాడు. ఈ మాటలు మార్చే వ్యక్తి ఎవరికీ కనిపించడం లేదా? ముందొక మాట వెనకొక మాట.. ఏ రోజూ ఎవరూ ఈ పాయింట్ గురించి మాత్రం మాట్లాడరు.. ఇవి ఎందుకు కనిపించడం లేదని అరుస్తూనే ఉంది. దీంతో రేవంత్. అయితే వీడియో అడుగు అంటూ ఆమెపై విసుక్కుంటాడు.

మొత్తానికి ఈ వారం అత్యధికంగా రేవంత్, ఆదిరెడ్డికి నామినేషన్లు పడ్డాయి. వీరిద్దరికీ చెరో నాలుగు నామినేషన్లు రాగా.. అనంతరం రోహిత్‌కు మూడు నామినేషన్లు వచ్చాయి. చివరకు 13వ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు నామినేట్ అయిన వారిలో ఆరుగురు ఉన్నారు. కెప్టెన్ ఇనాయా, శ్రీహాన్ మినహా అందరూ నామినేషన్‌లో ఉన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం