OTT Top 5 Movies this Week: ఈ వారం ఓటీటీల్లో రానున్న టాప్-5 సినిమాలు ఇవే.. కామెడీ నుంచి థ్రిల్లర్స్ వరకు..
OTT Top 5 Movie releases this Week: ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఓ తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. భారీ ప్రశంసలు పొందిన ఓ చిత్రం కూడా వస్తోంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 చిత్రాలు ఏవో చూడండి.
కొత్త ఏడాది 2025 జనవరి తొలి వారంలోనూ కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. వివిధ జానర్ల చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఐదు సినిమాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. ఓ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన ఓ మలయాళ మూవీ కూడా అందుబాటులోకి రానుంది. ఈ వారం ఓటీటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టాప్-5 సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
కథా కమామిషు
కథా కమామిషు సినిమా రేపు (జనవరి 2) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. థియేటర్లలో కాకుండా ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇస్తోంది. ఈ కామెడీ డ్రామా మూవీలో ఇంద్రజ, కరుణ కుమార్, కృతిక రాయ్, కృష్ణ ప్రసాద్, హర్షిణి కోడూరు, వెంకటేశ్ కాకుమాను, శృతి రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గౌతమ్ - కార్తీక్ దర్శకత్వం వహించారు. కొత్త పెళ్లయిన నాలుగు జంటల ఫస్ట్ నైట్ తిప్పల చుట్టూ సరదాగా ఈ చిత్రం సాగుతుంది. కథా కమామిషు మూవీని ఆహా ఓటీటీలో రేపటి నుంచి చూసేయవచ్చు.
ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్
కేన్స్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ జనవరి 3వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మలయాళ చిత్రంలో కని కశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పాయల్ కపాడియా తెరకెక్కించారు. ముంబై నగరంలో జీవించే ఇద్దరు నర్సుల చుట్టూ ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రం తనకు నచ్చిందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా వెల్లడించారు. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ జనవరి 3న హాట్‍స్టార్ ఓటీటీలోకి రానుంది.
లవ్ రెడ్డి
లవ్ రెడ్డి సినిమా ఆహా ఓటీటీలో జనవరి 3వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ లవ్ రొమాంటిక్ మూవీలో అంజన్ రామచంద్ర, శ్రావణి కృష్ణవేణి హీరోహీరోయిన్లుగా నటించారు. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ స్టోరీ చుట్టూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సామ్రాన్ రెడ్డి. 2024 అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మోస్తరుగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు జనవరి 3న ఆహా ఓటీటీలోకి ఈ చిత్రం రానుంది.
ట్రాప్
హాలీవుడ్ మూవీ ‘ట్రాప్’.. జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (జనవరి 2) స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. జియోసినిమా ఓటీటీలోకి ఇప్పుడు రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ట్రాప్ చిత్రంలో జోష్ హార్ట్‌నెట్ లీడ్ రోల్ చేయగా.. నైట్ ష్యామలాన్ దర్శకత్వం వహించారు.
కడకన్
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కడకన్’ జనవరి 3వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం హకీమ్ షాజహాన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీకి సాజిల్ మాంపాడ్ దర్శకత్వం వహించారు. గతేడాది మార్చిలో ఈ చిత్రం థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సన్‍నెక్స్ట్ ఓటీటీలోకి వస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్