Top Korean Remake Movies: ఇండియాలో సూపర్ హిట్ అయిన కొరియన్ రీమేక్ మూవీస్ ఇవే.. అన్నీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే
Top Korean Remake Movies: కొరియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతున్న వేళ మన దేశంలో అక్కడి సినిమాలను సైలెంట్ గా రీమేక్ చేసి వదిలారు. ఆ మూవీస్ ఏంటో మీరే చూడండి.
Top Korean Remake Movies: సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకర్స్ కొత్త కొత్త స్టోరీల కోసం దేశ, విదేశాల వైపు చూస్తున్నారు. భారతీయ భాషల్లోని సినిమాలే ఒక దాని నుంచి మరొకదానికి రీమేక్ అవడం కామనే. కానీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కొన్ని కొరియన్ సినిమాలను బాలీవుడ్ లో తీసి హిట్ కొట్టారు. అందులో చాలా వరకూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి.
రాధె (సల్మాన్ ఖాన్)
అత్యధిక వసూళ్లు రాబట్టిన కొరియన్ మూవీస్ లో ఒకటైన ఔట్‌లాస్ అనే సినిమా ఆధారంగా హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన రాధె తెరకెక్కించారు. అయితే ఇక్కడ మాత్రం ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.
భారత్ (సల్మాన్ ఖాన్)
సల్మాన్ ఖాన్ నటించిన మరో మూవీ భారత్. కొరియన్ మూవీ ఓడ్ టు మై ఫాదర్ కు ఇది రీమేక్. అక్కడ హిట్ అయినా.. హిందీలో మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
బర్ఫీ (రణ్‌బీర్ కపూర్)
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటించిన బర్ఫీ మూవీ కూడా కొరియన్ మూవీకి రీమేకే. 2002లో సౌత్ కొరియాలో వచ్చిన లవర్స్ కాన్సెర్టో మూవీ ఆధారంగా తెరకెక్కించారు. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినా.. ఈ సినిమాలు రణ్‌బీర్ తోపాటు ఇతరుల నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఏక్ విలన్ (సిద్ధార్థ్ మల్హోత్రా)
కొరియన్ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ ఐ సా ద డెవిల్ ను రీమేక్ చేస్తూ హిందీలో ఏక్ విలన్ తీశారు. అక్కడ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక్కడ ఏక్ విలన్ ఫర్వాలేదనిపించింది.
ధమాకా (కార్తీక్ ఆర్యన్)
కార్తీక్ ఆర్యన్ నటించిన ధమాకా మూవీకి హిందీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ కొరియాలో వచ్చిన ది టెర్రర్ లైవ్ అనే సినిమాకు రీమేక్.
దురంగా వెబ్ సిరీస్ - జీ5 ఓటీటీ
జీ5 ఓటీటీలో వచ్చిన దురంగా వెబ్ సిరీస్ మంచి హిట్ కొట్టింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. కొరియన్ డ్రామా ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ కు రీమేక్ కావడం విశేషం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.
బ్లైండ్ (సోనమ్ కపూర్)
బాలీవుడ్ లో సోనమ్ కపూర్ నటించిన బ్లైండ్ మూవీ కూడా కొరియన్ రీమేకే. 2011లో అదే పేరుతో వచ్చిన సినిమాను హిందీలో రీమేక్ చేశారు.
తీన్ (Te3n)
బాలీవుడ్ లో వచ్చిన తీన్ మూవీలో అమితాబ్ బచ్చన్ నటించాడు. ఈ సినిమా కొరియన్ మూవీ మాంటేజ్ కు రీమేక్. 2016లో ఈ మూవీ హిందీలో రిలీజైంది.