OTT Top 7 Releases This week: ఈ వారం టాప్-7 ఓటీటీ రిలీజ్‍లు ఇవే.. అమర్‌సింగ్ చమ్కీలా నుంచి గామి, ఓం భీమ్ బుష్ వరకు..-top 7 ott releases this week amar singh chamkila to premalu om bheem bush disney plus hotstar zee5 prime video aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Top 7 Releases This Week: ఈ వారం టాప్-7 ఓటీటీ రిలీజ్‍లు ఇవే.. అమర్‌సింగ్ చమ్కీలా నుంచి గామి, ఓం భీమ్ బుష్ వరకు..

OTT Top 7 Releases This week: ఈ వారం టాప్-7 ఓటీటీ రిలీజ్‍లు ఇవే.. అమర్‌సింగ్ చమ్కీలా నుంచి గామి, ఓం భీమ్ బుష్ వరకు..

OTT Top 7 Releases This week: ఈ వారం ఓటీటీల్లోకి మరిన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన 7 ఏవో ఇక్కడ చూడండి.

Top 7 OTT Releases This week: ఈ వారం టాప్-7 ఓటీటీ రిలీజ్‍లు ఇవే.. అమర్‌సింగ్ చమ్కీలా నుంచి గామి, ఓం భీమ్ బుష్ వరకు..

Top 7 OTT Releases This week: ఈవారం ఓటీటీల్లోకి మరిన్ని చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో కొత్తగా చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానున్నాయి. అమర్ సింగ్ చమ్కీలా చిత్రం నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రేమలు, గామి, ఓం భీమ్ బుష్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఈ ఏప్రిల్ రెండో వారంలోనే అడుగుపెట్టనున్నాయి. అలా.. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న టాప్-7 ఓటీటీ రిలీజ్‍లు ఏవంటే..

అమర్ సింగ్ చమ్కీలా

అమర్ సింగ్ చమ్కీలా సినిమా ఏప్రిల్ 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. పంజాబీ సింగర్, మ్యూజిషియన్ అమర్ సింగ్ చమ్కీలా జీవితంపై అదే పేరుతో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీకి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించగా.. అమర్ సింగ్ పాత్రను దిల్జీత్ దోషంజ్ పోషించారు. ఏప్రిల్ 12 నుంచి అమర్ సింగ్ చమ్కీలాను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

ప్రేమలు

థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన మలయాళ మూవీ ప్రేమలు చిత్రం కూడా ఈవారంలోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. ప్రేమలు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 12న స్ట్రీమింగ్‍‍కు రానుంది. మళయాళం, తమిళం, హిందీ భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ మూవీ ఏప్రిల్ 12న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. నెస్లనే కే గూఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించిన ప్రేమలు చిత్రానికి గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు.

పొన్ ఒండ్రు కాందెన్

తమిళ సినిమా పొన్ ఒండ్రు కాందెన్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఏప్రిల్ 14న ఈ చిత్రం జియో సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అశోక్ సెల్వన్, వసంత్ రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.

గామి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమా ఏప్రిల్ 12వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ జీ5లో ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ అందుబాటులోకి రానుంది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన గామి మార్చి 8న థియేటర్లలో కమర్షియల్‍గా సక్సెస్ అవటంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది.

లాల్ సలామ్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలకపాత్ర పోషించిన లాల్ సలామ్ సినిమా ఏప్రిల్ 12వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. క్రికెట్, మతకలహాల అంశం చుట్టూ తిరిగే లాల్ సలామ్ చిత్రం థియేటర్లో అంచనాలను అందుకోలేకపోయింది.

ఓం భీమ్ బుష్

ఓం భీమ్ బుష్ చిత్రం ఏప్రిల్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో పోషించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మంచి హిట్ అయింది. డైరెక్టర్ శ్రీహర్ష కొనగంటి తెరకెక్కించిన ఓం భీమ్ బుష్ మార్చి 22న థియేటర్లలో రిలీజై మంచి హిట్ కొట్టింది.

శర్మ అండ్ అంబానీ

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘శర్మ అండ్ అంబానీ’ చిత్రం కూడా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కార్తీక్ సాయి దర్శకత్వం వహించారు.