OTT Movies: ఓటీటీలో ఆహా అనిపించే 6 తెలుగు సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. హారర్ నుంచి బోల్డ్ వరకు.. ఇక్కడ చూసేయండి!-top 6 ott movies trending on aha in telugu with rating marco razakar emoji zebra vivekanandan viral 7g ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో ఆహా అనిపించే 6 తెలుగు సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. హారర్ నుంచి బోల్డ్ వరకు.. ఇక్కడ చూసేయండి!

OTT Movies: ఓటీటీలో ఆహా అనిపించే 6 తెలుగు సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. హారర్ నుంచి బోల్డ్ వరకు.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

OTT Movies Top 6 Trending In Telugu: ఓటీటీలో ఆహా అనిపించే ఆరు తెలుగు సినిమాలు ట్రెండింగ్ అవుతున్నాయి. అవన్నీ ఒక్కో డిఫరెంట్ జోనర్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఈ తెలుగు సినిమాలన్నీ హారర్, వయెలెంట్, క్రైమ్ థ్రిల్లర్, బోల్డ్, రొమాంటిక్ కామెడీతో ఉన్నాయి.

ఓటీటీలో ఆహా అనిపించే 6 తెలుగు సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. హారర్ నుంచి బోల్డ్ వరకు.. ఇక్కడ చూసేయండి!

OTT Movies In Telugu: ఓటీటీలో ఆహా అనిపించే ఆరు తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్నీ గత కొన్ని రోజులుగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఆహాలో ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఈ ఆరు సినిమాలు ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జోనర్‌లో ఉన్నాయి. మరి ఆ ఆహా ఓటీటీ టాప్ 6 ట్రెండింగ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

మార్కో ఓటీటీ

మలయాళంలో మోస్ట్ వయలెంట్ యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన సినిమా మార్కో. హనీఫ్ అదేని దర్శకత్వంలో ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 6.9 ఐఎమ్‌డీబీ రేటింగ్ అందుకున్న మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ. 104 నుంచి 115 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది.

రక్తపాతం, వెన్నులో వణుకుపుట్టించే యాక్షన్ సీక్వెన్స్‌తో తెరకెక్కిన మార్కో సోనీ లివ్, ఆహా ఓటీటీల్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాలోని మూవీస్‌లలో టాప్ 1 ప్లేస్‌లో మార్కో ట్రెండ్ అవుతోంది.

రజాకార్ ఓటీటీ

యాంకర్ అనసూయ, బాబీ సింహా, వేదిక, ఇంద్రజ, ప్రేమ, రాజ్ ఆర్జున్ నటించిన హిస్టారికల్ పీరియాడిక్ యాక్షన్ మూవీ రజాకార్ మంచి ప్రశంసలు అందుకుంది. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికీ ఆహా ఓటీటీలో టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది. తెలుగు సినిమాల్లో టాప్ 1 ప్లేస్‌లో ఆహాలో ట్రెండ్ అవుతోన్న రజాకార్ మూవీకి ఐఎమ్‌డీబీ 10కి 7.4 రేటింగ్ ఇచ్చింది.

ఎమోజీ ఓటీటీ

తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన మూవీ ఎమోజీ. మహత్ రాఘవేంద్ర, దేవిక సతీష్, మానస చౌదరి, వీజే ఆషిక్ నటించిన ఎమోజీ సినిమాను సెన్ ఎస్ రంగసామి తెరకెక్కించారు. ఐఎమ్‌డీబీ నుంచి 6 రేటింగ్ సొంతం చేసుకున్న ఎమోజీ ఆహా ఓటీటీలో టాప్ 5 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది.

జీబ్రా ఓటీటీ

టాలీవుడ్ విలక్షణ హీరో సత్యదేవ్ నటించిన బ్యాంక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జీబ్రా. బ్యాంక్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో ప్రియా భవానీ శంకర్, ధనంజయ్, అమృత అయ్యంగర్, జెన్నిఫర్ పెసినాటో, కమెడియన్ సత్య, సత్యరాజ్ నటించారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన జీబ్రాకు ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 8 రేటింగ్ వచ్చింది.

ఇంట్రెస్టింగ్ సీన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సాగే జీబ్రా మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా ప్లాట్‌ఫామ్ తెలుగు సినిమాల్లో టాప్ 5 స్థానంలో జీబ్రా ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.

వివేకానందన్ వైరల్ ఓటీటీ

శృంగారం కోసం పరితపిస్తూ భార్యకు గాయాలు చేసే భర్త నేపథ్యంలో వివేకానందన్ వైరల్ సినిమా తెరకెక్కింది. మలయాళంలో బోల్డ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన వివేకానందన్ వైరల్ మూవీలో దసరా విలన్ షైన్ టామ్ చాకో, స్వాసిక, గ్రేస్ ఆంటోనీ, మరీనా మైఖేల్ కురిసింగల్ ప్రధాన పాత్రలు పోషించారు.

శృంగారం చేసే సమయంలో భార్యకు, ఎఫైర్ పెట్టుకున్న యువతికి గాయాలు చేస్తూ తృప్తి పడటం, స్టామినా కోసం లేహ్యాలు, ఆయుర్వేద మందులు వాడటం వంటి సీన్లతో సాగే ఈ వివేకానందన్ వైరల్ మూవీ 3.9 ఐఎమ్‌డీబీ రేటింగ్ దక్కించుకుంది. ఈ సినిమా ఆహా ఓటీటీలో టాప్ 8 ప్లేసులో ట్రెడింగ్‌లో ఉంది.

7జీ ఓటీటీ

తమిళ హీరోయిన్ సోనియా అగర్వాల్, సమ్రుతి వెంకట్, రోషన్ బషీర్, సిద్ధార్థ్ విపిన్, సుబ్రమణియమ్ శివ, స్నేహ గుప్తా నటించిన తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ 7జీ. హరూన్ దర్శకత్వం వహించిన 7జీ ఐఎమ్‌డీ నుంచి 4.5 రేటింగ్ సొంతం చేసుకున్నప్పటికీ ఆహా ఓటీటీలో అదరగొడుతోంది. భయపెట్టే హారర్ సీన్స్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే 7జీ మూవీ ఆహాలో టాప్ 9 ప్లేసులో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం