Best Thriller Web Series: ఆహా వీడియో ఓటీటీలో ఉన్న 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?-top 5 best telugu thriller web series on aha video ott kudi yedamaithe locked anyas tutorial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Best Thriller Web Series: ఆహా వీడియో ఓటీటీలో ఉన్న 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?

Best Thriller Web Series: ఆహా వీడియో ఓటీటీలో ఉన్న 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?

Hari Prasad S HT Telugu

Best Thriller Web Series: ఆహా వీడియోలో ఇప్పటి వరకూ వచ్చిన వెబ్ సిరీస్ లో మిస్ కాకుండా చూడాల్సిన 7 థ్రిల్లర్ సిరీస్ లు ఉన్నాయి. మరి అవి ఏంటి? వాటిలో మీరు ఎన్ని చూశారు అన్నది ఇక్కడ చూడండి.

ఆహా వీడియో ఓటీటీలో ఉన్న 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?

Best Thriller Web Series: ఆహా వీడియో.. ఎక్స్‌క్లూజివ్ గా తెలుగు కంటెంట్ ఇచ్చే ఓటీటీ. ఇప్పటికే ఇందులో ఎన్నో ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. అయితే థ్రిల్లర్ జానర్లో వచ్చిన సిరీస్ లో బెస్ట్ అనిపించేవి ఏవో ఇక్కడ చూడండి. గత ఐదేళ్లలో ఆహా వీడియో తెలుగు వాళ్లకు అందించిన వెబ్ సిరీస్ లో బెస్ట్ 7 థ్రిల్లర్ సిరీస్ ఇవే.

కుడి ఎడమైతే..

కుడి ఎడమైతే ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఓ పోలీస్ ఆఫీసర్, ఓ డెలివరీ బాయ్ చుట్టూ తిరుగుతుంది. సైన్స్ ఫిక్షన్ కు మిస్టరీ, థ్రిల్ జోడించి తీసిన సిరీస్ ఇది. పవన్ కుమార్ డైరెక్ట్ చేశాడు. అమలా పాల్, రాహుల్ విజయ్ నటించారు. ఈ ఇద్దరూ ఒకే రోజును మళ్లీ మళ్లీ గడపాల్సి రావడం అనే ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన వెబ్ సిరీస్ ఇది. ఇందులోని ట్విస్టులు, థ్రిల్స్ మస్ట్ వాచ్ గా మార్చేశాయి.

లాక్డ్ (Locked)

సత్యదేవ్ నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. అతడు ఇందులో ఆనంద్ చక్రవర్తి అనే న్యూరోసర్జన్ రోల్లో నటించాడు. ఈ సిరీస్ ఆ డాక్టర్, అతని ఇంట్లో దొంగతనానికి వచ్చి అక్కడే బందీలుగా మారిపోయిన వారి చుట్టూ తిరుగుతుంది. మంచి సస్పెన్స్, థ్రిల్ తో ఈ లాక్డ్ వెబ్ సిరీస్ ఆకట్టుకునేలా సాగుతుంది.

11th హవర్

తమన్నా నటించిన వెబ్ సిరీస్ 11th హవర్. ఇందులో ఆమె ఓ వ్యాపారవేత్త పాత్రలో నటించింది. కార్పొరేట్ మోసాలు, కుటుంబ సంక్లిష్టతల చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఇందులో ఆరాత్రికా రెడ్డి అనే పాత్రలో ఆమె కనిపించింది. గడువులోపు తన సంస్థను కాపాడుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లు, తెలిసే రహస్యాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది.

అన్యాస్ ట్యూటోరియల్

రెజీనా నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అన్యాస్ ట్యుటోరియల్. ఇందులో నివేదితా సతీష్ కూడా మరో లీడ్ రోల్లో నటించింది. ఆమె చేసే యూట్యూబ్ వీడియోలో బాగా పాపులర్ అవుతుంటాయి. ఈ క్రమంలో తన ఇంట్లోని అతీత శక్తుల వీడియోలను కూడా ఆమె చేస్తూ మరింత పేరు సంపాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలో ఆమె సోదరి మధు (రెజీనా) రావడంతో పరిస్థితి మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.

కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్

ఓ చిన్న టౌను నుంచి పెద్ద కలలు కంటూ వచ్చే నలుగురు యువకులు, వాళ్లు చేసే ఓ రియల్ ఎస్టేట్ డీల్ చుట్టూ తిరిగే కథే ఈ కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్. ఓ తప్పుడు కేసు కారణంగా జైలకు వెళ్లే వాళ్లు.. తిరిగి వచ్చిన తర్వాత అండర్‌వరల్డ్ డాన్లుగా మారతారు. ఈ క్రమంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్లేంటన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం