Wives: భర్తల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న నలుగురు తెలుగు హీరోయిన్స్.. మహేశ్ బాబు భార్య నమ్రతా నుంచి ప్రియమణి వరకు!-top 4 telugu heroines good decisions for their husbands mahesh babu wife namrata shirodkar priyamani soundarya sreeleela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Wives: భర్తల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న నలుగురు తెలుగు హీరోయిన్స్.. మహేశ్ బాబు భార్య నమ్రతా నుంచి ప్రియమణి వరకు!

Wives: భర్తల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న నలుగురు తెలుగు హీరోయిన్స్.. మహేశ్ బాబు భార్య నమ్రతా నుంచి ప్రియమణి వరకు!

Sanjiv Kumar HT Telugu

Heroines Good Decisions As Wife For Husbands: హీరోయిన్స్ భార్యలుగా మారిన తర్వాత భర్తల కోసం కొన్ని త్యాగాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని మంచి నిర్ణయాలుగా భావిస్తుంటారు. మరి భార్యలుగా భర్తల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న నలుగురు తెలుగు స్టార్ హీరోయిన్స్ ఎవరు, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

భర్తల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న నలుగురు తెలుగు హీరోయిన్స్.. మహేశ్ బాబు భార్య నమ్రతా నుంచి ప్రియమణి వరకు!

Heroines Good Decisions As Wife For Husbands: హీరోయిన్స్‌గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు భార్యలుగా మారగానే సినిమాలకు దూరంగా ఉండటం వంటివి చేస్తుంటారు. కానీ, కొంతమంది పెళ్లయిన తర్వాత కూడా మూవీస్ కంటిన్యూ చేస్తారు. అయితే, హీరోయిన్స్ భార్యలుగా మారిన తర్వాత భర్తల కోసం కొన్ని త్యాగాలు చేస్తుంటారు.

వాటిలో కొన్ని మంచి నిర్ణయాలుగా హీరోయిన్స్ భావిస్తుంటారు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత తమ భర్తల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న నలుగురు తెలుగు స్టార్ హీరోయిన్స్ ఎవరు, ఆ డెసిషన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సౌందర్య

దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగారు సౌందర్య. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే, తన కెరీర్ బాగున్న సమయంలోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన జీఎస్ రఘను 2003 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు సౌందర్య.

అయితే, పెళ్లికి ముందే భర్త కోసం ఓ నిర్ణయం తీసుకున్నారు సౌందర్య. "డబ్బులిస్తున్నారు కదా అని రొమాంటిక్ సీన్స్‌లో, ఇంటిమేట్ సీన్స్‌లో రేపటి రోజు మ్యారేజ్ అయ్యాక నా భర్తకు ఏం చెప్పాలి. అందుకే ఇంటిమేట్ సీన్స్‌లలో నటించను" అని సౌందర్య చెప్పినట్లు సమాచారం.

ప్రియమణి

తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియమణి పెళ్లైన కొత్తలో మూవీతో చాలా పాపులర్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్లిన ప్రియమణి ప్రస్తుతం నటిగా యాక్ట్ చేస్తోంది.

సినిమాలు, ఓటీటీ సిరీస్‌లతో అలరిస్తోంది. ఇటీవలే భామాకలాపం 2 ఓటీటీ మూవీలోని పాత్రకు ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 నుంచి ఉత్తమ హాస్యనటి పురస్కారం అందుకుంది. అయితే, ప్రియమణి తనను సినిమాల్లో చూసినప్పుడు ఆమె పిల్లలు, భర్త అసౌకర్యకంగా ఫీల్ అవ్వకూడదని మ్యారేజ్ తర్వాత ఇంటిమేట్ సీన్లలో నటించట్లేదని ఒక షోలో చెప్పుకొచ్చింది.

నమ్రతా శిరోద్కర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పెళ్లికి ముందు పలు సినిమాల్లో హీరోయిన్‌గా అలరించారు. చిరంజీవితో అంజి, మహేశ్ బాబుతో వంశీ సినిమాల్లో జోడీ కట్టి ఆడిపాడారు. తెలుగులోనే కాకుండా హిందీలో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన నమ్రతా శిరోద్కర్ మహేశ్ బాబును పెళ్లాడిని తర్వాత మూవీస్‌కు దూరంగా ఉన్నారు.

మహేశ్ బాబు ఫ్యామిలీ, పిల్లలు గౌతమ్ ఘట్టమనేని, సితారలను చూసుకునేందుకు భర్త బిజినెస్‌లు, ఇతర ఇంటి విషయాలు మ్యానేజ్ చేయడానికి నమ్రతా శిరోద్కర్ సినిమాల్లో నటించట్లేదు.

శ్రీలీల

ఇవాళ (మార్చి 28) రాబిన్‌హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీల డ్యాన్సింగ్ క్వీన్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. తానెప్పుడు లిప్ కిస్ సీన్‌లో నటించలేదని, తన ఫస్ట్ లిప్ కిస్ ఆమెకు కాబోయే భర్తకే అని ఈ మధ్య చెప్పింది శ్రీలీల.

దాంతో శ్రీలీల కామెంట్స్ వైరల్ అయ్యాయి. పెళ్లి సందD సినిమాలో శ్రీలీల లిప్ కిస్ పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే, గ్రాఫిక్స్ ఉపయోగించి కూడా లిప్ కిస్ సీన్స్ చిత్రీకరిస్తారు అని శ్రీలల ఫ్యాన్స్ సపోర్ట్ పలుకుతున్నారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం