ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు- చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఒక్కోటి ఒక్కో జోనర్!-top 10 trending ott movies on netflix today to watch good bad ugly jack jewel thief court mad square ott release telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు- చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఒక్కోటి ఒక్కో జోనర్!

ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు- చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఒక్కోటి ఒక్కో జోనర్!

Sanjiv Kumar HT Telugu

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నేటి ట్రెండింగ్ టాప్ 10 సినిమాల జాబితా వచ్చేసింది. వాటిలో చూడాల్సిన ది బెస్ట్ మూవీస్‌గా ఐదు ఉన్నాయి. ఇక అవన్నీ తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కోటి ఒక్కో జోనర్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సినిమాలు, వాటి స్థానాలు ఏంటో ఓసారి లుక్కేద్దాం.

ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు- చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఒక్కోటి ఒక్కో జోనర్!

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతోంది నెట్‌ఫ్లిక్స్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానే అలరిస్తున్న నెట్‌ఫ్లిక్స్ అందరి ఆదరణ పొందుతోంది. ఇక ఎప్పటిలాగే నేటి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితా వచ్చేసింది. మరి ఆ సినిమాల్లో చూడాల్సిన ది బెస్ట్ ఐదు సినిమాలపై లుక్కేద్దాం.

గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. సుమారు రూ. 270 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 246 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా పేరు తెచ్చుకుంది.

ఇలాంటి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ డే నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 1 స్థానంలో గుడ్ బ్యాడ్ అగ్లీ కొనసాగుతోంది. బెస్ట్‌గా ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వీక్షించవచ్చు.

జాక్ ఓటీటీ

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య తొలిసారిగా జోడీ కట్టిన సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన జాక్ మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. స్పై యాక్షన్ కామెడీ త్రిల్లర్‌గా వచ్చిన జాక్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 3 స్థానంలో తెలుగు మూవీ జాక్ స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా కూడా చూసేందుకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

జువెల్ థీఫ్ ఓటీటీ

నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా జువెల్ థీఫ్. దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ హీరోగా చేసిన జువెల్ థీఫ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి హిందీతోపాటు తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 4 స్థానం సంపాదించుకున్న జువెల్ థీప్ చూసేందుకు బెస్ట్ ఆప్షన్.

కోర్ట్ ఓటీటీ

ప్రియదర్శి లాయర్‌గా అదరగొట్టిన కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్ వర్సెస్ ఏ నోబడీ. ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో వచ్చిన కోర్ట్ మూవీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఎప్పుడో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన కోర్ట్ ఇప్పటికీ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. టాప్ 5 ప్లేసులో కోర్ట్ ఓటీటీ ట్రెండ్ అవుతోంది. ఇది చూసేందుకు చాలా మంచి సినిమా.

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ

కడుపుబ్బా హాయిగా నవ్వుకోడానికి చూడాల్సిన బెస్ట్ సినిమా మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్‌కు సీక్వెల్‌గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సినిమాలో హీరోల కామెడీ టైమింగ్ అదిరిపోయిందని టాక్ వచ్చింది. దీంతో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా టాప్ 8 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా కూడా చూసేందుకు బెస్ట్ ఆప్షన్.

ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు

వీటితోపాటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 2 ప్లేసులో పొలిటికల్ థ్రిల్లర్ ది డిప్లోమాట్, టాప్ 6లో లాస్ట్ బుల్లెట్, టాప్ 7లో ఎక్స్‌టెర్రిటోరియల్, 9వ స్థానంలో రష్మిక మందన్నా ఛావా తెలుగులో, పదో ప్లేసులో ఇన్‌సైడ్ మ్యాన్ మోస్ట్ వాంటెడ్ చిత్రాలు కొనసాగుతున్నాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం