Netflix OTT Trending Movies Telugu Today: ఓటీటీలల్లో టాప్ ప్లేసులో దూసుకుపోతున్న ప్లాట్‌ఫామ్స్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను విభిన్న జోనర్లలో తీసుకొస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది. అయితే, ఇవాళ (ఏప్రిల్ 21) నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వాటిలో చూడాల్సిన ది బెస్ట్ 4 మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రియదర్శి లాయర్‌గా అదరగొట్టిన కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఫోక్సో కేసు చుట్టూ తిరిగే ఈ కోర్ట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది.
కోర్ట్ ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్‌లో ఉంటూ సత్తా చాటుతుంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న కోర్ట్ కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ సినిమా. కోర్ట్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 10కి 8 రేటింగ్ రావడం విశేషం.
రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఛావా. ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ సొంతం చేసుకున్న ఛావా బాక్సాఫీస్ భారీ వసూళ్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 2 ప్లేసులో నిలిచిని సత్తా చాటుతోంది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఛావా మూవీ కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ చిత్రం.
తమిళ హీరో వైభవ్, అతని సోదరుడు సునీల్ రెడ్డి, చాందిని తమిళరసన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎమ్ నటించిన తమిళ అడల్ట్ కామెడీ చిత్రం పెరుసు. తమిళనాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న పెరుసు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ట్రెడింగ్ టాప్ 5 స్థానంలో నిలిచింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న పెరుసు చూడాల్సిన బెస్ట్ మూవీనే. కానీ, ఫ్యామిలీతో చూడలేం.
కోలీవుడ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన రీసెంట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్స్‌గా చేశారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. నేటి యువతకు మంచి మోటివేషన్, ఇన్సిపిరేషన్ ఇచ్చే ఐఎమ్‌డీబీ నుంచి 7.9 రేటింగ్‌తోపాటు రొట్టెన్ టొమాటోస్ నుంచి 96 శాతం ఫ్రెష్ కంటెంట్ అని పేరు తెచ్చుకుంది.
ఇలాంటి డ్రాగన్ ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో 7వ స్థానంలో ఇవాళ దూసుకుపోతోంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న డ్రాగన్ కచ్చితంగా చూడాల్సిన మంచి సినిమా.
ఇలా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ 4 మూవీస్ ఇవే. ఇవన్నీ తెలుగులో స్ట్రీమింగ్ అవడమే కాకుండా మంచి ఐఎమ్‌డీబీ నుంచి మంచి రేటింగ్ సొంతం చేసుకున్నాయి.
ఇక మిగతా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు, వాటి స్థానాలు చూస్తే.. టాప్ 3లో ఐ హోస్టేజీ, టాప్ 4లో పూజా హెగ్డే దేవా, ఆరో స్థానంలో నయనతార టెస్ట్, 8వ ప్లేసులో ఆఫీసర్ ఆన్ డ్యూటీ, టాప్ 9లో క్రావెన్ ది హంటర్ (తెలుగు), టాప్ 10లో చివరిగా పుష్ప 2 ది రూల్ ఉన్నాయి.
సంబంధిత కథనం