Flop Movies 2024 ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన 10 పెద్ద సినిమాలు- స్టార్ హీరోవే 3- ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే!
Top 10 Biggest Bollywood Flop Movies In 2024: 2024 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయితే, మరికొన్ని ప్లాప్‌గా మారాయి. ఈ సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో 2024లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన టాప్ 10 పెద్ద సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
Top 10 Flop Movies In 2024: ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో చిన్న బడ్జెట్ సినిమాలతోపాటు భారీ బడ్జెట్ మూవీస్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాప్‌గా మిగిలాయి. 2024 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2024 ఇయర్ ఎండింగ్ సందర్భంగా భారీ అంచనాలతో వచ్చి ప్లాప్‌గా మిగిలిన టాప్ 10 బిగ్ బాలీవుడ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. మెర్రీ క్రిస్మస్
విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భారీ అంచనాలతో ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది. అయితే, రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మెర్రీ క్రిస్మస్ మూవీ భారీ అంచనాలతో విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 19.61 కోట్లు (సక్నిల్క్ ప్రకారం) మాత్రమే కలెక్ట్ చేసి ప్లాప్‌గా మిగిలింది.
2. యోధా
సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధా మార్చి 15న భారీ అంచనాలతో విడుదలై ఇండియాలో రూ. 35.56 కోట్లు కలెక్ట్ చేసింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 52 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది.
3. ఆరోన్ మెయిన్ కహా దమ్ తా
స్టార్ హీరో హీరోయిన్స్ అజయ్ దేవగన్, టబు నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ఆరోన్ మెయిన్ కహా దమ్ తా ఆగస్ట్ 2న విడుదలైంది. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రూ. 100 కోట్ల బడ్జెట్ పెడితే.. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 12.91 కోట్లు మాత్రమే రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
4. క్రాక్
విద్యుత్ జమాల్, అమీ జాక్సన్, నోరా ఫతేహి, అర్జున్ రాంపాల్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ క్రాక్ మూవీని రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 13.91 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్‌గా నిలిచింది.
5. సర్ఫిరా
ఆకాశమే నీ హద్దురా మూవీకి హిందీ రీమేక్‌గా వచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సర్ఫిరా జూలై 12న భారీ అంచనాలతో రిలీజ్ అయింది. 80 కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సర్ఫిరా 30.02 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా పేరు తెచ్చుకుంది.
6. ఖేల్ ఖేల్ మే
అక్షయ్ కుమార్, తాప్సీ, ప్రగ్యా జైస్వాల్, వాణి కపూర్, ఆదిత్య సియాల్, ఫర్దీన్ ఖాన్ వంటి స్టార్స్ నటించిన కామెడీ మూవీ ఖేల్ ఖేల్ మే మూవీ రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ, బాక్సాఫీస్ వద్ద 57.49 కోట్లు మాత్రమే రాబట్టి డిజాస్టర్‌గా మారింది.
7. బడే మియాన్ చోటే మియాన్
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన అతి భారీ మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బడే మియాన్ చోటే మియాన్ బడ్జెట్ రూ. 350 కోట్లు. భారీ అంచనాలతో ఏప్రిల్ 11న రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 65.96 కోట్లు, వరల్డ్‌వైడ్‌గా రూ. 110 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా షాక్ ఇచ్చింది.
8. చందు ఛాంపియన్
హిందీ బయోగ్రఫికల్ స్పోర్ట్స్ డ్రామా చందు ఛాంపియన్‌కు టాక్ బాగా వచ్చిన బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా మిగిలింది. ఈ సినిమాను రూ. 88.73 కోట్లతో తీస్తే వరల్డ్ వైడ్‌గా రూ. 88.14 కోట్లు రాబట్టింది.
9. మైదాన్
అజయ్ దేవగన్, ప్రియమణి నటించి స్పోర్ట్స్ డ్రామా మూవీ మైదాన్ రూ. 235 కోట్ల బడ్జెట్ పెట్టి తెరకెక్కించారు. కానీ, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 68.09 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. దీంతో అత్యంత భారీ డిజాస్టర్ మూవీగా మైదాన్ నిలిచింది.
స్టార్ హీరోవి 3
ఇలా భారీ అంచనాలతో వచ్చి ఊహించనివిధంగా ఈ టాప్ 10 బాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాలు ఫ్లాప్‌గా, డిజాస్టర్స్‌గా నిలిచాయి. వీటిలో స్టార్ హీరోలు అయిన అక్షయ్ కుమార్‌వి మూడు ఉంటే, అజయ్ దేవగన్‌ని రెండు ఉండటం గమనార్హం.