బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ఐదో వారం వీకెండ్‍కు వచ్చేసింది. ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీల టెన్షన్ విపరీతంగా నెలకొంది. హౌస్‍మేట్లు ఈ విషయంలో కంగారుగా ఉండగా.. ప్రేక్షకుల్లో ఈ విషయంపై ఆసక్తి నెలకొంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎవరు వస్తారనే ఉత్కంఠ ఉంది. ఈ తరుణంలో నేటి (అక్టోబర్ 5) శనివారం ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి కంటెస్టెంట్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
“ఈ వారం నీ నిర్ణయాలన్నీ సరైనవేనా” అని సీతను నాగార్జున ప్రశ్నించటంతో నేటి రెండో ప్రోమో మొదలైంది. కాదని సీత అన్నారు. విష్ణుప్రియ, మణికంఠను తానే నామినేట్ చేశానని, వాళ్లను తీసేసే ఇష్టం లేక త్యాగం చేయాలనుకున్నానని వివరణ ఇచ్చారు. “మొదటి మూడు వారాలు కోపం తగ్గించుకో, కంట్రోల్ చేసుకో.. బోర్డర్ దాటొద్దు అని నేనే చెప్పా.. దమ్ముగా ఆడుతున్నావ్” అంటూ పృథ్విరాజ్‍ను నాగార్జున ప్రశంసించారు.
బోర్డుపై ఉన్న నైనిక ఫొటోపై క్రాస్ సింబల్ పెయింట్ స్ప్రే చేశారు నాగార్జున. “చిన్న ప్యాకెట్.. పెద్ద బ్లాస్ట్.. ఏదీ బ్లాస్ట్ ఏది” అని నైనికను నిలదీశారు. ఫస్ట్ వీక్ నేను చూసిన నైనిక ఎక్కడికి వెళ్లిపోయిందని ప్రశ్నించారు. తుఫాను రాబోతోందని హెచ్చరించారు. “తుఫాను రాబోతోందమ్మా. వైల్డ్ కార్డ్స్ ఒకరి తర్వాత ఒకరు రానున్నారు” అని నాగ్ అన్నారు. “మీరు వైల్డ్‌గా లేకపోతే వాళ్లను తట్టుకోలేరు” అంటూ హౌస్‍మేట్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు.
నాగ మణికంఠను ఎప్పుడు మాట్లాడదామని నాగ్ అడిగితే.. ఎప్పుడైనా సరే అని అతడు చెప్పారు. సీత బాడీ లాంగ్వేజ్‍తో ప్రాబ్లం ఏంటి అని మణిని నాగార్జున ప్రశ్నించారు. వెక్కిరించినట్టుగా అనిపించిందని మణి చెప్పారు. తమనే మణి టార్గెట్ చేసినట్టు అనిపిస్తోందని సీత చెప్పారు.
ఆ తర్వాత మణికంఠను యాక్షన్ రూమ్‍కు నాగార్జున పిలిచారు. 8 నిమిషాలు టైమ్ ఇస్తున్నానని, ఎంత ఏడ్వాలనుకుంటున్నావో ఏడ్చేయంటూ మణికి ఆఫర్ ఇచ్చారు నాగ్. తన ఏడుపు మొత్తం పోయిందని మణి చెప్పారు. దీంతో అక్కడే ఉండిపో అని ప్రియ అనిందనుకో అని నాగ్ ఏదో చెప్పబోయారు. దీంతో తనకు భయమేస్తోందని మణి ఏడ్చేశారు. “నీకు చెప్పాల్సిన విషయం ఇంకో విషయం ఉంది. ఏడ్వడం నీ స్ట్రాటజీ అయితే అది పనికి రాదు. హౌస్ అందరికీ తెలుసు” అని నాగ్ చెప్పారు. దీంతో మణి మరింత ఏడ్చారు. ఏం జరగనుందో పూర్తిగా నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది.
ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన తొలి ప్రోమో కూడా వచ్చింది. అందులోనూ మణికంఠను హౌస్‍మేట్స్ టార్గెట్ చేసినట్టు కనించింది. చిరాకు పెడతాడంటూ అతడికి ట్యాగ్ ఇచ్చి ఎక్కువ మంది హౌస్‍మేట్స్ కారణాలు చెప్పారు. అందరూ తననే పట్టించుకోవాలనే అనుకుంటారని, స్వార్థంగా ఆలోచిస్తారని అన్నారు.
బిగ్‍బాస్ తెలుగు 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఎనిమిది మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టనున్నారు. అయితే, అందరూ ఒకేసారి వస్తారా.. దశల వారీగా అడుగుపెడతారా అనేది చూడాలి.