Tom Holland | సూపర్ స్పోర్ట్స్ కారు కొన్న స్పైడర్‌మ్యాన్.. దీని ధర ఎంతో తెలుసా?-tom holland buy new porsche taycan and share photo on instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tom Holland Buy New Porsche Taycan And Share Photo On Instagram

Tom Holland | సూపర్ స్పోర్ట్స్ కారు కొన్న స్పైడర్‌మ్యాన్.. దీని ధర ఎంతో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Apr 09, 2022 04:57 PM IST

స్పైడర్‌మ్యాన్ చిత్రంతో పాపులారిటీని సంపాదించిన టామ్ హోలాండ్.. కొత్త కారును కొనుగోలు చేశాడు. పోర్షే టేకాన్ వాహనాన్ని తన గ్యారేజ్‌లో సొంతం చేసుకున్నాడు. ఈ కారు ధర దాదాపు రూ.2.13 కోట్లు.

పోర్షే కారుతో టామ్ హోలాండ్
పోర్షే కారుతో టామ్ హోలాండ్ (Twitter)

స్పైడర్‌మ్యాన్ సినిమాలతో యావత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు టామ్ హోలాండ్. గతేడాది ఈ యాక్టర్ నటించిన స్పైడర్‌మ్యాన్ నో వే ఫ్రమ్ హోమ్ చిత్రం వసూళ్ల సునామీని సృష్టించింది. భారత్‌లోనూ అదిరిపోయే కలెక్షన్లను రాబట్టిందీ చిత్రం. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు టామ్. తాజాగా సూపర్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీతో ఉన్న ఈ లగ్జరీ విద్యుత్ వాహనం ఆకట్టుకుంటోంది. ఇంతకీ టామ్ కొనుగోలు చేసిన కారు పోర్షే టేకాన్. అంతేకాకుండా ఆ కారుతో ఫొటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు.

ఎలక్ట్రిక్ వైపునకు వెళ్లేందుకు సహాయం చేసిన పోర్షేకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుకు నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తో టామ్ మళ్లీ వచ్చాడని తమ స్పందనను తెలియజేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టామ్ అని ఒకరు పోస్ట్ పెట్టగా.. కొత్త కారు కొన్నందుకు శుభాకాంక్షలు అని మరోకరు స్పందించారు. నీ కార్ల కలెక్షన్లలో మరో బీస్ట్ వచ్చిందని ఇంకోకరు కామెంట్ చేశారు.

టామ్ హోలాండ్ కొనుగోలు చేసిన పోర్షే టేకాన్ వాహనం ఖరీదు వచ్చేసి రూ.2.13 కోట్లు. ఇందులో అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీని పొందుపరిచారు. గరిష్ఠంగా గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్తుంది. అంతేకాకుండా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం కేవలం 4 సెకండ్లలోపే అందుకుంటుంది. 563 బీహెచ్‌పీ బ్రేక్ హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్ వాహనంలో 93.4కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, మల్టీ ఫంక్షన్ స్పోర్ట్స్ స్ట్రీరింగ్ వెహికల్, 10.9 అంగుళాల ఇంఫోటైన్మెంట్ సిస్టం, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. ఈ వాహనంతో పాటు టామ్ వద్ద ఆడీఆర్ఎస్7, ఆడీఆర్ఎస్7 స్పోర్ట్స్ బ్యాక్, ఆడీ క్యూ7, ఆడీ ఆర్8, రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ తదితర వాహనాలు ఉన్నాయి.

మార్వెల్ సినిమాక్ యూనివర్స్‌లో ఆరు సూపర్ హీరో చిత్రాలతో స్పైడర్‌మ్యాన్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా టామ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2107లో BAFTA రైజింగ్ స్టార్ అవార్డును అందుకున్నాడు. స్పైడర్ మ్యాన్ పాత్ర పోషించిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్పైడర్ మ్యాన్‌ హోమ్ కమింగ్ చిత్రం 2017లో విడుదలైంది. 2019లో విడుదలైన ఫార్ ఫ్రమ్ హోమ్ చిత్రం కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఇది 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది.

గతేడాది విడుదలైన స్పైడర్ మ్యాన్ నోవే హోమ్‌ అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 1.8 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్