Constable Movie: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా కానిస్టేబుల్ - మేఘం కురిసింది పాట రిలీజ్‌-tollywood updates megham kurisindi song from varun sandesh constable unveiled by talasani srinivas yadav ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Constable Movie: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా కానిస్టేబుల్ - మేఘం కురిసింది పాట రిలీజ్‌

Constable Movie: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా కానిస్టేబుల్ - మేఘం కురిసింది పాట రిలీజ్‌

Nelki Naresh HT Telugu

Constable Movie: కానిస్టేబుల్ పేరుతో ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు వ‌రుణ్ సందేశ్‌. ఈ సినిమాలోని మేఘం కురిసింది అనే పాట‌ను మాజీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ రిలీజ్ చేశాడు. ఈ పాట‌ను ర‌మ్య బెహ‌రా ఆల‌పించింది.

కానిస్టేబుల్ మూవీ

Constable Movie: ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌కు దూర‌మ‌య్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు వ‌రుణ్ సందేశ్‌. గ‌త కొన్నాళ్లుగా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాలు చేస్తోన్నాడు. ప్ర‌స్తుతం కానిస్టేబుల్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఆర్య‌న్ సుభాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌ధులిక హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మేఘం కురిసింది...

ఈ సినిమాలోని మేఘం కురిసింది...ప్రేమ మురిసింది అనే పాట‌ను మాజీ మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఈ పాట‌ను ర‌మ్య బెహ‌రా ఆల‌పించింది. రామారావు సాహిత్యం అందించారు. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించాడు.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌...

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైనదని అన్నారు. విధి నిర్వహణలో పోలీసుల‌కు ఎదురయ్యే ఇబ్బందులు, వృత్తికి, కుటుంబ బాధ్య‌త‌ల‌కు మ‌ధ్య వారు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను సస్పెన్స్, థ్రిల్లర్ అంశాల‌తో ఈ మూవీలో చ‌క్క‌గా చూపించిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని చెప్పారు. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు విజ‌య‌వంత‌మైన‌ప్పుడే మ‌రిన్ని మంచి సినిమాలు రూపొందే అవ‌కాశం ఉంద‌ని త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ చెప్పారు. సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు.

సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ‌తో...

ఇటీవ‌ల కానిస్టేబుల్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. సీరియ‌ల్ కిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు టీజ‌ర్ ద్వారా మేక‌ర్స్ హింట్ ఇచ్చారు. ఓ అమ్మాయిని కిల్ల‌ర్ అతి దారుణంగా హింసించి చంప‌డం, ఈ కేసును ఓ కానిస్టేబుల్ ఎలా ఛేదించాడ‌న్న‌ది టీజ‌ర్‌లో యాక్ష‌న్ అంశాల‌తో చూపించారు.

కానిస్టేబుల్ మూవీలో ముర‌ళీధ‌ర్ గౌడ్‌, దువ్వాసి మోహ‌న్‌, ర‌వివ‌ర్మ‌, క‌ల్ప‌ల‌త కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోంది. గ‌త ఏడాది రిలీజైన నింద‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు వ‌రుణ్ సందేశ్‌. ఇటీవ‌ల రిలీజైన రాచ‌రికం మూవీలో విల‌న్‌గా న‌టించాడు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం