బాహుబలి, మళ్లీరావాతో పాటు తెలుగులో 75కుపైగా సినిమాల్లో చైల్డ్ యాక్టర్‌గా నటించాడు సాత్విక్ వర్మ. తాజాగా అతడు హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్రేమిస్తున్నా పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రీతి నేహా హీరోయిన్‌గా నటిస్తోంది. భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవల ప్రేమిస్తున్నా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాయకానాయికలు రొమాంటిక్‌గా కనిపించారు. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
అన్ని ప్రేమకథల్లోనూ ప్రేమ ఉంటుంది, కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించబోతున్నామని మేకర్స్ అన్నారు. లవ్ లో ఇదివరకు ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక డిఫరెంట్ పాయింట్ తో ప్రేమిస్తున్నాసినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు భాను శంకర్ చెప్పాడు.
యంగ్ జనరేషన్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని అన్నారు. ఈ ప్రేమకథలో సాత్విక వర్మ, ప్రీతి నేహా ఇద్దరూ పోటీపడి నటించారని, , వీరిమధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ను క్రియేట్ చేసేలా దర్శకుడు భాను రూపొందించారని మేకర్స్ పేర్కొన్నారు.
సాలూరి రాజేశ్వర రావు కుటుంబానికి చెందిన సిద్ధార్థ్ సాలూరి ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఇప్పటికే ప్రేమిస్తావా సినిమా కోసం ఐదు సూపర్బ్ సాంగ్స్ ను ఇచ్చాడు సిద్దార్థ్. భాస్కర్ శ్యామల సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల డైలాగ్స్ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ అన్నారు. ప్రేమిస్తావా మూవీలో ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు, వారి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ప్రేమిస్తావా కంటే ముందు తెలుగులో ఎవరే అతగాడు, ఆర్‌డీఎక్స్ లవ్, రాజధాని ఫైల్స్, రాజు మహారాజు సినిమాలకు దర్శకత్వం వహించాడు భాను శంకర్.
సంబంధిత కథనం