సీరియ‌ల్స్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న‌ టాలీవుడ్ సీనియ‌ర్ హీరో - క‌న్న‌డంలో రీమేక్ అవుతోన్న తెలుగు సూప‌ర్ హిట్ సీరియ‌ల్‌-tollywood senior hero suman to play key role in kannada serial snehada kadalalli ninnukori serial kannada remake ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సీరియ‌ల్స్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న‌ టాలీవుడ్ సీనియ‌ర్ హీరో - క‌న్న‌డంలో రీమేక్ అవుతోన్న తెలుగు సూప‌ర్ హిట్ సీరియ‌ల్‌

సీరియ‌ల్స్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న‌ టాలీవుడ్ సీనియ‌ర్ హీరో - క‌న్న‌డంలో రీమేక్ అవుతోన్న తెలుగు సూప‌ర్ హిట్ సీరియ‌ల్‌

Nelki Naresh HT Telugu

టాలీవుడ్ సీనియ‌ర్‌ హీరో సుమ‌న్ బుల్లితెర‌పై ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫ‌స్ట్ టైమ్ ఓ టీవీ సీరియ‌ల్‌ చేస్తున్నాడు. త్రిన‌య‌ని ఫేమ్ చందు గౌడ లీడ్ రోల్‌లో క‌న్న‌డంలో స్నేహ‌ద క‌డ‌ల‌ల్లి పేరుతో ఓ సీరియ‌ల్ తెర‌కెక్కుతోంది. ఈ సీరియ‌ల్‌లో సుమ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

హీరో సుమ‌న్

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో సుమ‌న్ బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇస్తోన్నారు. అది కూడా క‌న్న‌డ సీరియ‌ల్ ద్వారా టీవీలోకి అడుగుపెట్ట బోతున్నారు. త్రిన‌య‌ని సీరియ‌ల్ ఫేమ్ చందు గౌడ క‌న్న‌డంలో స్నేహ‌ద క‌డ‌ల‌ల్లి పేరుతో ఓ సీరియ‌ల్ చేస్తోన్నాడు. స్టార్ సువ‌ర్ణ ఛానెల్‌లో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతుంది.ఈ సీరియ‌ల్‌కు సంబంధించిన ప్రోమోను ఇటీవ‌ల రిలీజ్ చేశారు.

హీరో తండ్రిగా...

ఈ సీరియ‌ల్‌లో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో సుమ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ప్రోమోలో సుమ‌న్ క‌నిపించారు. లీడ్ యాక్ట‌ర్‌గా న‌టిస్తోన్న చందు గౌడ‌కు తండ్రి పాత్ర‌లో సుమ‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సీరియ‌ల్‌లో సుమ‌న్‌ది ఫుల్ లెంగ్త్ రోల్ అని స‌మాచారం.స్నేహ‌ద క‌డ‌ల‌ల్లి సీరియ‌ల్‌లో కావ్య మ‌హ‌దేవ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పెళ్లి డ్రెస్‌లో...

ప్రోమోలో కావ్య మ‌హ‌దేవ్ పెళ్లి దుస్తుల్లో పోలీస్ స్టేష‌న్‌లో కూర్చొని క‌నిపించింది. ఫ‌స్ట్ నైట్ రోజే భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డి ఇంట్లో నుంచి పారిపోయివ‌చ్చిన‌ట్లుగా చూపించారు. కావ్య‌కు శ్రేయోభిలాషిగా చందుగౌడ ప్రోమోలో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో విజ‌య‌వంత‌మైన నిన్ను కోరి సీరియ‌ల్‌కు రీమేక్‌గా స్నేహ‌ద క‌డ‌ల‌ల్లి తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. నిన్ను కోరి సీరియ‌ల్‌లో శివ‌కుమార్‌, అక్షిత దేశ్‌పాండే హీరోహీరోయిన్లుగా న‌టించారు.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ...

క‌న్న‌డ సీరియ‌ల్ యాక్ట‌ర్ అయిన చందుగౌడ త్రిన‌య‌ని సీరియ‌ల్ ద్వారానే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియ‌ల్‌లో విశాల్‌గా అభిమానుల‌ను మెప్పించాడు. జీ తెలుగులో లాంగెస్ట్ ర‌న్నింగ్ సీరియ‌ల్‌గా కొన‌సాగిన త్రిన‌య‌నికి ఇటీవ‌లే శుభం కార్డు ప‌డింది. 1463 ఎపిసోడ్స్‌తో మేక‌ర్స్ ఈ సీరియ‌ల్‌ను ముగించారు.

ఆషికా ప‌దుకుణే...

త్రిన‌య‌ని సీరియ‌ల్‌లో టైటిల్ పాత్ర‌లో ఆషికా ప‌దుకుణే న‌టించింది. చందు గౌడ‌, చైత్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సీరియ‌ల్‌లో తిలోత్త‌మ పాత్ర‌లో తొలుత ప‌విత్రా జ‌య‌రామ్ క‌నిపించింది. గ‌త ఏడాది జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ప‌విత్రా జ‌య‌రామ్ క‌న్నుమూయ‌డంతో ఆమె స్థానంలో చైత్ర‌ను మేక‌ర్స్ సెలెక్ట్ చేశారు.

టాప్ హీరోగా...

టాలీవుడ్‌లో 1980-90 ద‌శ‌కంలో టాప్ హీరోల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నాడు సుమ‌న్‌. యాక్ష‌న్ సినిమాల‌తో అభిమానుల‌కు చేరువ‌య్యాడు. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారి తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు చేస్తోన్నాడు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం