వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ ను స్ట్రాంగ్ గా నిర్మించుకునే పనిలో ఉన్నాడు మన రౌడీ విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఓ వైపు ‘కింగ్‌డమ్’ రిలీజ్ కు రెడీగా ఉండగా.. మరోవైపు మరో రెండు ప్రాజెక్ట్ లు విజయ్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఒకటైన ‘రౌడీ జనార్ధన్’ మూవీలో ఓ సీనియర్ టాలీవుడ్ హీరో కీ రోల్ ప్లే చేయబోతున్నారని తెలిసింది.
టాలీవుడ్ లో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు రాజశేఖర్. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలతో మెప్పించారు. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇతర మూవీస్ లో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాలో రాజశేఖర్ యాక్ట్ చేస్తున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ‘రౌడీ జనార్ధన్’ మూవీలో విజయ్ దేవరకొండ, రాజశేఖర్ కాంబినేషన్ ఉంటుందని టాక్.
విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తున్న మూవీకి ‘రౌడీ జనార్ధన్’ అని పేరు పెట్టారు. రౌడీ బ్రాండ్ పేరుతో ఫ్యాన్స్ లో విజయ్ దేవరకొండ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆ పేరు క్యాచీగా ఉంటుందని ఈ మూవీకి ‘రౌడీ జనార్ధన్’ అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. ఈ మూవీకి దిల్ రాజు ప్రొడ్యూసర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ హంగులతో తెరకెక్కించనున్నారు.
రౌడీ జనార్ధన్ మూవీ కోసం విజయ్ దేవరకొండతో మరోసారి రష్మిక మంధాన జతకట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పెయిర్ ఇప్పటికే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసింది. మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ షిప్ లో ఉన్నారనే గాసిప్ గురించి తెలిసిందే. ఈ జోడీ తరచుగా ఫొటలతో హింట్లు ఇస్తోంది. ఈ జంట మరోసారి జతకడితే మూవీపై భారీ అంచనాలు నెలకొనే అవకాశముంది.
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్‌డమ్’ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మే 30న థియేటర్లకు రావాల్సిన ఈ సినిమా జులై 4కు పోస్ట్ పోన్ అయింది. భారత్, పాక్ ఉద్రిక్త పరిస్థితులతో నెలకొన్న పరిణామాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. మరోవైపు రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్ లో పీరియడిక్ డ్రామా చేస్తున్నాడు విజయ్.
సంబంధిత కథనం