Sankranthi Movies OTTs: సంక్రాంతి సినిమాల ఓటీటీలు ఇవే.. ఏ సినిమా ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుంది?
Sankranthi Movies OTTs: సంక్రాంతి బరిలో మూడు తెలుగు చిత్రాలు బరిలోకి దిగాయి. పండుగకు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ మూడు సినిమాలకు ఇప్పటికే ఓటీటీ డీల్స్ జరిగాయి. ఏ మూవీ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందో ఇక్కడ చూడండి.
టాలీవుడ్‍లో ఈసారి కూడా సంక్రాంతి కళ బాగానే ఉంది. ఈసారి పండుగకు రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ముందుగా బరిలోకి దిగింది. జనవరి 10వ తేదీన ఈ మూవీ రిలీజ్ అయింది. నట సింహం బాలకృష్ణ యాక్షన్ ధమాకా మూవీ డాకు మహారాజ్ జనవరి 12న థియేటర్లలోకి విడుదలైంది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పండుగ రోజైన నేడే (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, మూడు సంక్రాంతి సినిమాలు ఇప్పటికే ఓటీటీ పార్ట్‌నర్లను ఖరారు చేసుకున్నాయి. ఆ వివరాలు ఇవే..

గేమ్ ఛేంజర్
రామ్‍చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ చిత్రం థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. పొలిటికల్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో చరణ్ నటనకు ఫుల్ మార్క్ పడ్డాయి. రెండు పాత్రల్లోనూ చెర్రీ ఇరగదీశారు. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు.
గేమ్ ఛేంజర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు డీల్ చేసుకుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరిలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్‍చరణ్‍తో పాటు అంజలి, కియారా అడ్వానీ, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీలకపాత్రలు చేయగా.. థమన్ మ్యూజిక్ అందించారు.
డాకు మహారాజ్
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. ఈ చిత్రంలో స్టైలిష్ యాక్షన్‍తో బాలయ్య దుమ్మురేపారు. ఈ మూవీకి తొలి రోజే రూ.56కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. బాలకృష్ణకు ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా ఉంది.
డాకు మహారాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం కూడా ఫిబ్రవరిలో స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించగా.. నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‍గా చేశారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, షైన్ టామ్ చాకో కీలకపాత్రల్లో కనిపించారు.
సంక్రాంతికి వస్తున్నాం
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ కామెడీగా పండుగకు సరిగ్గా సూటయ్యే కంటెంట్‍తో ఈ మూవీ వచ్చింది. దీంతో బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. ఈ సినిమాకు కూడా రిలీజ్‍కు ముందు ఓటీటీ డీల్ జరిగింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ కైవసం చేసుకుంది. ఈ చిత్రం కూడా ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. ఈ మూవీని దిల్ రాజు, శిరీశ్ నిర్మించగా.. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు.
సంబంధిత కథనం
టాపిక్