Tollywood Update: పండుగలకు స్ట్రెయిట్ సినిమాలకే థియేటర్లు - ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం
Tollywood Update:దసరా సంక్రాంతి పండుగలకు తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు మాత్రమే థియేటర్లు కేటాయించాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
Tollywood Update: ఇకపై పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇవ్వాలంటూ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆదివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఇందుకు సంబంధించిన ప్రకటనను రిలీజ్ చేశారు. . గత కొన్నేళ్లుగా పెరుగుతోన్న నిర్మాణ వ్యయాల కారణంగా నిర్మాత శ్రేయస్సు ను దృష్టిలో పెట్టుకొని తెలుగు సినిమాని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రకటించింది.
సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇవ్వాలని, డబ్బింగ్ సినిమాలకు ఇవ్వకూడదని డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను నిర్మాతల మండలి కోరింది.
దిల్‌రాజుకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఏడాదిలో దిల్‌రాజు స్ట్రెయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. అప్పుడు ఆయన చేసిన మాటలను ఉద్దేశించే ప్రజెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సివచ్చిందని నిర్మాతల మండలి చెబుతోంది.
స్ట్రెయిట్ సినిమాలకు ప్రయారిటీ ఇస్తూ మిగిలిన థియేటర్లను డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని ఈ మీటింగ్‌లో తీర్మాణించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దిల్‌రాజు నిర్మిస్తోన్న తమిళ సినిమా వారిసు తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతున్నది. ఒకవేళ ఈ నిర్ణయం అమలులోకి వస్తే వారసుడు సినిమాకు థియేటర్లు దొరకడం కష్టమే అవుతోంది. నిర్మాతల మండలి నిర్ణయంపై దిల్‌రాజు ఎలా స్పందిస్తారన్నది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.