Journey To Ayodhya Movie: రామాయణం ఆధారంగా తెలుగు ప్రొడ్యూసర్ మూవీ - ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్!
Journey To Ayodhya Movie: రామాయణం ఆధారంగా తెలుగులో ఓ మూవీ రాబోతోంది. ఈ సినిమాకు జర్నీ టూ అయోధ్య అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Journey To Ayodhya Movie: ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మైథలాజికల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. పౌరాణిక కథల్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. ఈ మైథలాజికల్ మూవీస్‌లో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతున్నారు. తాజాగా రామాయణం ఆధారంగా తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై ఓ మూవీ రాబోతోంది.
జర్నీ టూ అయోధ్య
ఈ సినిమాకు జర్నీ టూ అయోధ్య అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. గోపీచంద్‌తో విశ్వం మూవీని నిర్మిస్తోన్న వేణు దోనేపూడి జర్నీ టూ అయోధ్య మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. విశ్వం తర్వాత తన బ్యానర్ చిత్రాలయం స్టూడియోస్ వేణు దోనేపూడి నిర్మించనున్న సెకండ్ మూవీ ఇదే కావడం గమనార్హం. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్‌చేశారు. ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జర్నీ టూ అయోధ్య మూవీకి దర్శకుడు వి.ఎన్.ఆదిత్య కథను అందిస్తున్నారు.
రామాయణం గొప్పతనంతో...
రామాయణంపై, రామాయణంను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప గొప్ప నటీనటులు సీతా రాములుగా, రావణ, లక్ష్మణ, ఆంజనేయులుగా నటించి ప్రేక్షకులను అలరించారు. వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా రామాయణం గొప్పతనాన్ని, విశిష్టతను మరింత చాటిచెప్పేలా జర్నీ టూ అయోధ్య ఉండబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం జర్నీ టూ అయోధ్య మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయోధ్యతో పాటు దేశంలో పలు ప్రసిద్ధ ప్రాంతాల్లో ఈ షూటింగ్‌ను జరుపబోతున్నారు. ప్రస్తుతం లోకేషన్స్‌కు సంబంధించి అన్వేషణలో వీఎన్ ఆదిత్య అండ్ టీమ్ బిజీగా ఉన్నాడు.
బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్స్...
జర్నీ టూ అయోధ్య మూవీకి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో టాలీవుడ్‌తో పాటు పలువురు బాలీవుడ్ ఆర్టిస్టులు కనిపించబోతున్నట్లు తెలిసింది. బాలీవుడ్‌లో హనుమాన్ సీరియల్‌తో ఫేమస్ అయిన దారాసింగ్ మనవడు ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు. భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీకి నిర్మాణ సారథిగా సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ వ్యవహరించబోతున్నాడు.
గోపీచంద్‌తో విశ్వం...
ప్రస్తుతం గోపీచంద్‌తో విశ్వం సినిమాను తెరకెక్కిస్తోన్నాడు ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస పరాజయాల్లో ఉన్న గోపీచంద్‌తో పాటు శ్రీను వైట్ల కెరీర్‌కు విశ్వం కీలకంగా మారింది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రవితేజ అమర్ అక్బర్ ఆంథోనీ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
మరోవైపు ఇటీవల భీమా మూవీతో గోపీచంద్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఫెయిల్యూర్‌గ ఆనిలిచింది.
టాపిక్