Game Changer Movie: ప్ర‌మోష‌న్స్ చేయ‌కుండా గేమ్ ఛేంజ‌ర్‌ను దిల్‌రాజు చంపేశాడు - టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌!-tollywood producer natti kumar interesting comments on ram charan game changer result ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Movie: ప్ర‌మోష‌న్స్ చేయ‌కుండా గేమ్ ఛేంజ‌ర్‌ను దిల్‌రాజు చంపేశాడు - టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌!

Game Changer Movie: ప్ర‌మోష‌న్స్ చేయ‌కుండా గేమ్ ఛేంజ‌ర్‌ను దిల్‌రాజు చంపేశాడు - టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Jan 18, 2025 12:28 PM IST

Game Changer Movie: గేమ్ ఛేంజ‌ర్ సినిమాను ప్ర‌మోష‌న్స్ చేయ‌కుండా నిర్మాత దిల్ రాజు చంపేశార‌ని న‌ట్టి కుమార్ కామెంట్స్ చేశాడు. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజ‌ర్ ఒక్క‌టే అస‌లు నిల‌బ‌డాల్సిన మూవీ న‌ట్టి కుమార్ పేర్కొన్నాడు. అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

గేమ్ ఛేంజ‌ర్ సినిమా
గేమ్ ఛేంజ‌ర్ సినిమా

Game Changer Movie: రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూవీ రిజ‌ల్ట్‌పై ప్రొడ్యూస‌ర్ న‌ట్టి కుమార్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. గేమ్‌ఛేంజ‌ర్ సినిమాను ప‌బ్లిసిటీ చేయ‌కుండా నిర్మాత దిల్‌రాజు చంపేశార‌ని న‌ట్టికుమార్ ఆరోపించాడు. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో అస‌లు నిల‌బ‌డాల్సిన మూవీ గేమ్ ఛేంజ‌ర్ ఒక్క‌టేన‌ని న‌ట్టి కుమార్ చెప్పాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం, డాకు మ‌హారాజ్ రొటీన్ సినిమాలు అని న‌ట్టికుమార్ తెలిపాడు.

రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేది...

ఇద్ద‌రు పిల్ల‌ల్లో ఒక‌రిని ప్రేమిస్తూ ఇంకొక‌రిని దిల్‌రాజు చంపేశార‌ని, ప‌బ్లిసిటీ చేసి ఉంటే గేమ్ ఛేంజ‌ర్ రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేద‌ని న‌ట్టి కుమార్ పేర్కొన్నాడు.గేమ్ ఛేంజ‌ర్ వ‌ల్ల నిర్మాత‌కు ఎలాంటి న‌ష్టం రాలేద‌ని, ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ హ‌క్కులు కొన్న‌వారు మాత్రం బ‌ల‌య్యార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో న‌ట్టి కుమార్ కామెంట్స్ చేశాడు.

త‌ప్పులు లెక్క‌లు చెప్ప‌డం...

రంగ‌స్థ‌లం, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన రామ్‌చ‌ర‌ణ్‌ను ఈ సినిమాతో ప్రొడ్యూస‌ర్ ఇబ్బందులు పెట్టార‌ని తెలిపాడు. క‌లెక్ష‌న్స్ విష‌యంలో త‌ప్పుడు లెక్క‌లు చెప్ప‌డం రామ్‌చ‌ర‌ణ్‌కు ఇష్టం ఉండ‌ద‌ని న‌ట్టి కుమార్ చెప్పాడు. గేమ్ ఛేంజ‌ర్‌కు స‌రైన‌ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయ‌లేక‌పోయార‌ని అన్నాడు.

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌...

ఇప్ప‌డు ఆడియెన్స్ టేస్ట్ మారింద‌ని, మంచి చెబితే సినిమాలు చూసే ప‌రిస్థితి లేద‌ని, గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్‌, డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణా లాంటి కాన్సెప్ట్‌ల‌తో చేసిన సినిమాలు కోట్లు కొల్ల‌గొడుతోన్నాయి. మంచి కాన్సెప్ట్‌తో వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్‌ను మాత్రం ఎవ‌రూ ప‌ట్టించేకోలేద‌ని న‌ట్టి కుమార్ అన్నాడు.

న‌ట్టి కుమార్ కామెంట్స్‌లో నిజం ఉంద‌ని మెగా ఫ్యాన్స్ అంటోన్నారు. ప్ర‌మోష‌న్స్ కాదు కంటెంట్ వీక్ అంటూ మ‌రికొంద‌రు నెటిజ‌న్లు చెబుతోన్నారు.

120 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

మ‌రోవైపు గేమ్ ఛేంజ‌ర్ వ‌సూళ్లు రోజురోజుకు త‌గ్గుతూ వ‌స్తోన్నాయి. గురువారం రోజు రెండు కోట్ల అర‌వై ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ మూవీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఎనిమిది రోజుల్లో ఈ మూవీ 120 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. రెండు వంద‌ల ఇర‌వై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. నిర్మాత‌ల‌కు వంద కోట్ల మేర ఈ సినిమా న‌ష్టం మిగిల్చే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

ఐఏఎస్ వ‌ర్సెస్ సీఏం

గేమ్ ఛేంజ‌ర్ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నిజాయితీప‌రుడైన ఐఏఎస్ ఆఫీస‌ర్‌కు, అవినీతి ప‌రుడైన ముఖ్య‌మంత్రికి మ‌ధ్య జ‌రిగిన పోరాటంతో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీని రూపొందింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించింది. అంజ‌లి, శ్రీకాంత్‌, జ‌య‌రామ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఎస్‌జేసూర్య విల‌న్‌గా క‌నిపించాడు.

Whats_app_banner