Political Thriller OTT: సీనియర్ యాక్టర్ సాయికుమార్ లీడ్ రోల్‌లో నటించిన తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ లక్ష్మీ కటాక్షం థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. వినయ్, అరుణ్, దీప్తి వర్మ, ఆమని కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి సూర్య దర్శకత్వం వహించాడు.
గత ఏడాది మే నెలలో లక్ష్మీ కటాక్షం మూవీ థియేటర్లలో రిలీజైంది. రిలీజైన విషయం తెలియకుండానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. ఓ ఎమ్మెల్యేకకు, నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌కు మధ్య నెలకొన్న సంఘర్షణతో సెటైరికల్ కామెడీ డ్రామాగా దర్శకుడు లక్ష్మీ కటాక్షం సినిమాను తెరకెక్కించాడు.
ధర్మ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు పంచాలని నిర్ణయించుకుంటాడు. ఓటుకు ఐదు వేలు పంచేందుకు వంద కోట్లు సమకూర్చుకుంటాడు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా అడ్డుకోవాలని పోలీస్ ఆఫీసర్ అర్జున్ నిర్ణయించుకుంటాడు. ఆ వంద కోట్లను పట్టుకొని ధర్మను ఎన్నికల్లో గెలవకుండా చేయాలని అనుకుంటాడు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు? ధర్మకు చెందిన వంద కోట్లు ఏమయ్యాయి? లక్ష్మీ కటాక్షం అనే కోడ్‌కు డబ్బుకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ పొలిటికల్ వార్‌లోకి ఓ ప్రేమ జంట ఎలా వచ్చింది? అన్నదే ఈ మూవీ కథ.
లక్ష్మి కటాక్షం మూవీతో పలువురు కొత్త ఆర్టిస్టులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. లక్ష్మీ కటాక్షం కంటే ముందు తెలుగులో రంగ్‌దే, ద్రోహితో పాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది దీప్తి వర్మ.ఈ సినిమాకు అభిషేక్ మ్యూజిక్ అందించాడు.
టాలీవుడ్‌లో సీనియర్ యాక్టర్లలో ఒకరిగా కొనసాగుతోన్నాడు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయికుమార్ ఆ తర్వాత యాక్టర్‌గా మారాడు. హీరోగా అంతఃపురం, పోలీస్ స్టోరీతో పాటు పలు సినిమాలతో విజయాలను అందుకున్నాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం, జనతా గ్యారేస్, ఎస్ఆర్ కళ్యాణ మండపం, కమిటీ కుర్రాళ్లుతో పాటు పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవల రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కోర్ట్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించాడు. సినిమాలే కాకుండా గాలివాన, బృంద వెబ్‌సిరీస్‌లు కూడా సాయికుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
సంబంధిత కథనం